సందడి షురూ.. | Students return to school after summer vacation ends | Sakshi
Sakshi News home page

సందడి షురూ..

Jun 9 2025 1:26 AM | Updated on Jun 9 2025 1:26 AM

Students return to school after summer vacation ends

ముగిసిన వేసవి సెలవులు 

బడిబాటకు విద్యార్థుల సన్నద్ధం 

బుక్‌ స్టోర్స్, స్టేషనరీస్‌లో తల్లిదండ్రుల హడావుడి 

నూతన ఉత్సాహంతో విద్యార్థులు, చిన్నారులు.. 

పిల్లల స్కూల్‌ సమయాలకు షెడ్యూల్‌ ప్రిపరేషన్‌ 

జూన్‌ తొలి వారంలోనే నగరంలోని ప్రముఖ బుక్‌ స్టోర్లు, స్టేషనరీ షాపులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో క్రిక్కిరిసిపోయాయి. నోటుబుక్స్, కవర్లు, బ్యాగులు, వాటర్‌ బాటిల్స్, లంచ్‌ బాక్స్‌లు, పెన్సిల్‌ బాక్స్‌లు ఇలా ఒక్కో ఐటెమ్‌ కోసం క్యూలో నిలబడే పరిస్థితి. కొన్ని స్టోర్ల వద్ద ప్రత్యేకంగా ‘బ్యాక్‌ టు స్కూల్‌’ ఆఫర్లు, కాంబో డీల్స్‌ అందించడంతో కొనుగోలుదారుల ఉత్సాహం మరింత పెరిగింది. 

కొత్త ఆశలు, పాత అలసటలు.. 
చదువు అంటే కొత్త ఆవిష్కరణలకు నాంది. స్కూల్‌ అంటే కేవలం పుస్తకాలే కాదు – స్నేహితులు, ఆటలు, అసైన్‌మెంట్లు, టీచర్ల పనిష్మెంట్లు అన్నీ కలిపే ఒక ప్రత్యేక అనుభవం. కొంతమంది విద్యార్థులు ‘ఈసారి నాకు ఫస్ట్‌ ర్యాంక్‌ రావాలనుకుంటున్నా’ అనే ఉత్సాహంతో స్కూల్‌ బ్యాగ్‌ సిద్ధం చేస్తుంటే, మరికొందరు ‘ఇంకా సెలవులు కావాలి’ అనే భావనలో ఉన్నారు. తల్లిదండ్రులకైతే రోజువారి జీవనశైలిలో మరోసారి క్రమపద్ధతిలోకి రావాల్సిన అవసరం ఏర్పడింది.

టైమ్‌ టేబుల్స్, టిఫిన్‌ బాక్స్‌లు..
వేసవి సెలవుల్లో రాత్రివేళల ఫిలింలు, ఉదయపు ఆలస్యమైన నిద్రలు ఇప్పుడు మళ్లీ అలారం ధ్వనితో ముగిసిపోతున్నాయి. తల్లిదండ్రులు ఇప్పుడు మళ్లీ ఉదయం 6 గంటలకే లేచి టిఫిన్లు తయారు చేయాల్సి వస్తోంది. సిటీ ట్రాఫిక్‌ మళ్లీ స్కూల్‌ బస్సులతో రద్దీగా మారింది. వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నవారైతే ట్రాఫిక్‌ టైంకు తగ్గట్టుగా తమ పని సమయాన్ని మార్చుకుంటున్నారు. 

మరో శిక్షణ ప్రయాణం..
పిల్లల జీవితాల్లో పాఠశాలలు శారీరక, మానసిక అభివృద్ధికి ముఖ్యపాత్ర పోషిస్తాయి. సెలవుల్లో అనుచితమైన స్క్రీన్‌ టైమ్‌ తగ్గించుకొని, మళ్లీ పఠనంలో, ఆటల్లో భాగస్వామ్యం కావడం పిల్లల ఆరోగ్యానికి మంచిది. తల్లిదండ్రులు ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం, సమయపాలనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement