పోలీసులు పట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారికి ఫిర్యాదు
వికారాబాదు జిల్లా: మెథడిస్టు క్రిస్టియన్ జాతరకు హాజరయ్యేందుకు వస్తు న్న శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదివారం గంటన్నరపా టు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. పోలీసు అధికా రులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఆయన జాతరకు వెళ్లకుండానే వెనుదిరిగారు. జాతర ముగింపు సందర్భంగా శిలువ దర్శ నానికి స్పీకర్ వికారాబాద్ నుంచి ధారూరు వరకు వచ్చారు. ఆయన కాన్వాయ్ కిలోమీ టర్ దూరం వెళ్లగానే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాన్వాయ్‌లో పోలీసులు లేకపోవ డంతో స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీస్ అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించారు. అనంతరం వారి నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.


