Strangers Set Car On Fire In Veldurthi Mandal; Body Found In Trunk - Sakshi
Sakshi News home page

కారుని దగ్ధం చేసిన దుండగులు.. డిక్కీలో డెడ్‌బాడీ

Aug 10 2021 11:57 AM | Updated on Aug 10 2021 3:12 PM

Strangers Set Car On Fire In Veldurthi Mandal, Dead Body Found In Trunk - Sakshi

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు మంగళవారం తెల్లవారు జామున కారుని తగలబెట్టేశారు. దగ్ధమైన కారుని పరిశీలించగా డిక్కీలో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. కారుతోపాటు గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం కాలిపోయి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహం ఎవరిదన్న దానిపై ​ దర్యాప్తు చేస్తున్నారు.

మంటల్లో కాలిబూడిదైన కాగా TS 05 EH 4005 అనే నెంబర్‌ ప్లేట్‌ కలిగి ఉంది. కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన ధర్మకారి శ్రీనివాస్‌రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ నిన్న స్వగ్రామం నుంచి హైద్రాబాద్‌ వచ్చాడు. అయితే శ్రీనివాస్‌ మొబైల్‌ రాత్రి నుంచి స్విచ్చాఫ్‌లో ఉందని అతని భార్య​ తెలిపింది. కారులోని మృతదేహం ఎవరిదనే విషయంపై ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. విచారణ కొనసాగుతోంది.


 

Advertisement
 
Advertisement
Advertisement