ప్రధాని మోదీతో గేదెల శ్రీనుబాబు భేటీ  | Srinubabu Gedela Meets PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో గేదెల శ్రీనుబాబు భేటీ 

Nov 9 2023 11:33 AM | Updated on Nov 9 2023 12:05 PM

Srinubabu Gedela Meets PM  Narendra Modi - Sakshi

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో ప‌ల్స‌స్ సీఈవో డాక్ట‌ర్ గేదెల శ్రీనుబాబు భేటీ అయ్యారు. బీసీల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరారు. గత రెండు దశాబ్దములలో ఉత్తరాంధ్ర నుండి 25 లక్షల మంది జీవనోపాధి కొరకు  వలస పోయారని ప్రధానికి తెలిపారు. ముక్యంగా హైదరాబాద్ కు 15 లక్షల మంది వలస పోయారని వివరించారు. 2014 లో తెలంగాణ రాష్ట్రము విడిపోయిని తరువాత   తెలంగాణ ప్ర‌భుత్వం బీసీ జాబితా నుంచి తొల‌గించిన ఉత్తరాంధ్ర మరియు ఆంధ్రకు చెందిన 26 కులాల‌ను  బీసీ జాబితాలో మరల వాటిని చేర్పించాల‌ని, కేంద్రం ఓబీసీ స‌ర్టిఫికెట్లు మంజూరు చేయాల‌ని కోరారు. శ్రీనుబాబు త‌న దృష్టికి తీసుకొచ్చిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామ‌ని ప్ర‌ధాని మోదీ హామీ ఇచ్చారు.   తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కి వ‌చ్చిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీని హైద‌రాబాద్‌లో కలిసిన తెలుగు రాష్ట్రాల బీసీల నాయ‌కుడు, ప‌ల్స‌స్ సీఈవో డాక్ట‌ర్ గేదెల శ్రీనుబాబు బీసీల స‌మస్య‌లు ప్ర‌ధాని దృష్టికి తీసుకొచ్చారు. 

 ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలుగా ఉన్న 26 కులాలను 2014  రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో తొల‌గించ‌డంతో వీరంతా సామాజిక, ఆర్థిక అన్యాయానికి గుర‌య్యార‌ని తెలిపారు. ఈ సమస్యను పునఃపరిశీలించి, సరిదిద్దేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాల‌ని ప్ర‌ధానిని కోరారు. ఈ 26 కులాలను తెలంగాణలోని వెనుకబడిన తరగతుల జాబితాలో మ‌ళ్లీ చేర్పించ‌డం ద్వారా దాదాపు 30 ల‌క్ష‌ల మందికి న్యాయం చేసిన వార‌వుతార‌ని మోదీకి వివ‌రించారు.

బీసీల ఆశాజ్యోతి ప్ర‌ధానిగా ఉన్న మ‌న దేశంలో బీసీల‌కి జ‌రుగుతున్న అన్యాయంపై స్పందిస్తార‌నే భ‌రోసా ల‌భించింద‌ని శ్రీనుబాబు ఆశాభావం వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో బీసీ జాబితాలో చేర్చ‌డంతోపాటు కేంద్రం ఓబీసీలో చేర్చిన‌ప్పుడు ఈ 26 కులాల‌కి జ‌రిగిన అన్యాయం స‌రిదిద్దిన‌ట్టు అవుతుంద‌ని ప్ర‌ధాని దృష్టికి తీసుకొచ్చారు. ఏళ్లుగా పోరాడుతున్న ఈ 26 కులాల‌ను తెలంగాణ‌లో బీసీ, కేంద్రంలో ఓబీసీ జాబితాలో స్థానం క‌ల్పిస్తే...అత్యంత వెన‌క‌బ‌డి, వివ‌క్ష‌కి గురైన ఈ కులాల‌కు విద్య‌, విజ్ఞాన‌, ఉద్యోగ‌, ఉపాధి రంగాల్లో మెరుగైన అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని ప్ర‌ధాని మోదీకి శ్రీనుబాబు వివ‌రించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement