తెలంగాణ రాష్ట్రమంతా నైరుతి | South West Monsoons expansion of Telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్రమంతా నైరుతి

Jun 6 2024 4:37 AM | Updated on Jun 6 2024 3:52 PM

హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి జలమయమైన రోడ్డు

హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి జలమయమైన రోడ్డు

వారంలో విస్తరించనున్న రుతుపవనాలు

ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తరణ 

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 

హైదరాబాద్‌ బేగంబజార్‌లో 8.5 సెం.మీ వర్షపాతం

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 3న రాష్ట్రంలోని ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. రెండ్రోజుల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ లోని నారాయణపేట, ఆంద్రప్రదేశ్‌లోని నర్సాపూర్‌ గుండా రుతుపవనాలు కదులుతున్నట్లు చెప్పింది. 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, కదలికలు ఇదే తరహాలో ఉంటే వారం రోజుల్లో రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయని అంచనా వేస్తోంది. 

రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటి పూట కొంతసేపు గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నప్ప టికీ.. ఆశాశం మేఘావృతం కావడంతో క్రమంగా ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గుతూ వస్తోంది. సాయంత్రానికి పూర్తిగా చల్లని వాతావరణం ఏర్పడుతోంది. రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణో గ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగా నమోదు కావొచ్చని ఆ శాఖ అంచనా వేసింది.  

నిజామాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత: దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. 

దీని ప్రభావంతో రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాలను పరిశీలిస్తే నిజామాబాద్‌లో 40.1 డిగ్రీ సెల్సీయస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.5 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది.  

ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

Advertisement
 
Advertisement
Advertisement