LB Nagar:మెడికల్‌ షాపులపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు | SOT Police Raids On LB Nagar Zone Medical Shops | Sakshi
Sakshi News home page

LB Nagar:మెడికల్‌ షాపులపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు

Jan 5 2024 7:26 PM | Updated on Jan 6 2024 3:18 PM

SOT Police Raids On LB Nagar Zone Medical Shops - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ జోన్‌లోని మెడికల్‌ షాప్‌లపై ఎస్‌ఓటీ పోలీసులు, నార్కో టిక్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. మెడికల్ షాప్‌లలో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పలు మెడికల్ షాప్‌లపై దాడులు నిర్వహించి నిషేధిత ఆల్ ఫ్రాక్స్ డ్రగ్స్‌ (NDPS), ఇంజెక్షన్లు, మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. పది మంది మెడికల్ షాప్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ప్రస్తుతం అల్కాపూరిలో దాడులు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement