అమ్మ ఆరోగ్యం కోసం..70 కి.మీ.

A sons journey with his mother in a wooden cart - Sakshi

చెక్కబండిలో తల్లిని ఉంచి ఓ తనయుడి ప్రయాణం 

రాయికల్‌(జగిత్యాల): నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ గ్రామానికి చెందిన మల్లయ్య తన తల్లి ఆరోగ్యం బాగుకోసం ఆమెను ఓ చెక్కబండిలో కూర్చోబెట్టుకుని సుమారు 70.కిలోమీటర్లు ప్రయాణించాడు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శించుకోవడంతోపాటు అక్కడ కొద్దిరోజులు గడిపితే తన తల్లి ఆరోగ్యం బాగుపడుతుందనే నమ్మకంతో సోమవారం ఖానాపూర్‌ నుంచి కర్రలతో తయారుచేసిన చెక్కబండిలో తల్లిని ఉంచి ప్రయాణం సాగించాడు.

తన తల్లి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, కొండగట్టుకు తీసుకెళ్తే కుదుటపడుతుందని భావిస్తున్నట్లు మల్లయ్య చెప్పాడు. తనవద్ద డబ్బులు లేకున్నా..తల్లి ఆరోగ్యం ముఖ్యమని, ఇందుకోసం తల్లిని ఎక్కడికైనా తీసుకెళ్తానని తెలిపాడు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top