breaking news
carts
-
ఈ–కార్ట్స్ వ్యాపారంలోకి కైనెటిక్ గ్రీన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ కార్ట్‌ల విభాగంలోకి ప్రవేశించడంపై కైనెటిక్ గ్రీన్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గోల్ఫ్, లైఫ్స్టయిల్స్ కార్టుల తయారీ కోసం ఇటలీకి చెందిన టొనినో లాంబోర్గినితో చేతులు కలిపింది. వచ్చే దశాబ్దకాలంలో 1 బిలియన్ డాలర్ల పైగా టర్నోవరును లక్ష్యంగా పెట్టుకుంది.ఇందుకోసం ఏర్పాటు చేసే కైనెటిక్ గ్రీన్ టొనినో లాంబోర్గిని (కేజీటీఎల్) జాయింట్ వెంచర్ సంస్థలో కైనెటిక్ గ్రీన్కి 70 శాతం, టొనినోకి 30 శాతం వాటాలు ఉంటాయి. వచ్చే పదేళ్లలో అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ కార్ట్ వ్యాపారంలో 10% వాటాను సాధించాలని నిర్దేశించుకున్నట్లు కైనెటిక్ గ్రీన్ సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వాని తెలిపారు. అమెరికా, యూరప్, ఆసియావ్యాప్తంగా 25–30 మార్కెట్లలో ప్రవేశించడం ద్వారా వచ్చే అయిదేళ్లలో 300 మిలియన్ డాలర్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.వచ్చే ఏడాది వ్యవధిలో జాయింట్ వెంచర్ సంస్థ వివిధ మార్గాల్లో 20 మిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు వివరించారు. గోల్ఫ్ కోర్సులు, రిసార్టులు, ఎయిర్‌పోర్టుల్లో ఎలక్ట్రిక్ కార్టులను వాడతారు. ఇవి 80–150 కి.మీ. రేంజితో, 10,000–14,000 డాలర్లకు లభిస్తాయి. దేశీయంగా ఏటా 1,500 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. -
అమ్మ ఆరోగ్యం కోసం..70 కి.మీ.
రాయికల్(జగిత్యాల): నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన మల్లయ్య తన తల్లి ఆరోగ్యం బాగుకోసం ఆమెను ఓ చెక్కబండిలో కూర్చోబెట్టుకుని సుమారు 70.కిలోమీటర్లు ప్రయాణించాడు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శించుకోవడంతోపాటు అక్కడ కొద్దిరోజులు గడిపితే తన తల్లి ఆరోగ్యం బాగుపడుతుందనే నమ్మకంతో సోమవారం ఖానాపూర్ నుంచి కర్రలతో తయారుచేసిన చెక్కబండిలో తల్లిని ఉంచి ప్రయాణం సాగించాడు. తన తల్లి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, కొండగట్టుకు తీసుకెళ్తే కుదుటపడుతుందని భావిస్తున్నట్లు మల్లయ్య చెప్పాడు. తనవద్ద డబ్బులు లేకున్నా..తల్లి ఆరోగ్యం ముఖ్యమని, ఇందుకోసం తల్లిని ఎక్కడికైనా తీసుకెళ్తానని తెలిపాడు. -
ఖాళీ మంచాలే గతి
హిందూపురం టౌన్ : పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పడుకోవడానికి ఖాళీ మంచాలే గతి. 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో పురుషులు, స్త్రీల వార్డులో చాలా మంచాలపై పరుపులు, దుప్పట్లు కూడా లేవు. దీంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే రోగులను ఖాళీ మంచాలపైనే పడుకోబెడుతున్నారని, కనీసం దుప్పట్లు కూడా ఇవ్వడం లేదని రోగులు వాపోతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి ఖాళీ మంచాలపై పరుపులు, దుప్పట్లు ఏర్పాటు చేయాలని రోగులు, రోగుల బంధువులు కోరుతున్నారు. -
కోడూరులో బండ్ల ఊరేగింపు
మెదక్(కోడూరు): మెదక్ జిల్లా కోడూరు మండల పరిధిలోని చంద్లాపూర్‌లో సోమవారం బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లతో గ్రామంలోని దేవాలయాల చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండాలని రైతులకు పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ గ్రామస్తులందరూ వాహనాలను గ్రామంలోని దేవాలయాల చుట్టూ తిప్పడంప్రతియేటా అనవాయితీగా వస్తున్నది. ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉన్న రంగనాయకుల స్వామి గుట్ట చుట్టూ బండ్లతో ఊరేగించి తమ మొక్కులను తీర్చుకుంటారు. గుట్ట కింద ఉన్న హనుమాన్ దేవాలయం, నవగ్రహ దేవాలయం, పెద్దమ్మ దేవాలయం, బీరప్ప దేవాలయం, ఎల్లమ్మ దేవాలయంతో పాటు తదితర దేవాలయాల చుట్టూ బండ్లను ఊరేగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో బండ్ల ఊరేగింపుతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం గ్రామంలో రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.