సూర్యాపేట పరువు హత్య.. అసలు ఏం జరిగింది.. ఎలా చేశారు? | Six Arrested In Suryapet Case | Sakshi
Sakshi News home page

సూర్యాపేట పరువు హత్య.. అసలు ఏం జరిగింది.. ఎలా చేశారు?

Jan 29 2025 4:15 PM | Updated on Jan 30 2025 12:10 PM

Six Arrested In Suryapet Case

సూర్యాపేట పరువు హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు

సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పరువు హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వడ్లకొండ కృష్ణ హత్య కేసుపై ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. జనవరి 26న కృష్ణ హత్య జరిగింది. కృష్ణ, భార్గవి కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం నేపథ్యంలోనే హత్య జరిగింది. ఏ1 కోట్ల నవీన్, ఏ2 బైరు మహేష్, ఏ3 కోట్ల సైదులు, ఏ4 కోట్ల వంశీ, ఏ5 కోట్ల భిక్షమమ్మ/ బుచ్చమ్మ ఏ6 నువ్వుల సాయి చరణ్‌లను చేరుస్తూ కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.

26న బైరు మహేష్ మూడు నెలలుగా కృష్ణతో స్నేహం చేశాడు. కృష్టను ఫోన్ చేసి బయటకు పిలిపించారు. రాత్రి తొమ్మిది గంటల‌ సమయంలో దాడి చేశారు. కృష్ణను హత్య చేశామని నవీన్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. మృతదేహాన్ని తీసుకెళ్లి పాత సూర్యాపేటకు వెళ్లారు. అక్కడ నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు. ఆ తర్వాత నల్లగొండకు వెళ్లి సాయిచరణ్‌కు చూపించారు. అందరూ కలిసి నల్లగొండ, కనగల్‌తో పాటు పలు చోట్ల మృతదేహాన్ని పడేయాలని చూశారు

చివరగా పిల్లలమర్రి చెరువు కట్టపై కృష్ణ మృతదేహాన్ని పడేశారు. గతంలో మూడుసార్లు హత్య చేసేందుకు ప్లాన్ చేసి విఫలం అయ్యారు. ఓ కత్తి కూడా కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచారు. నిందితులు నవీన్ పై నాలుగు కేసులు ఉన్నాయి. మహేష్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయి. వంశీపై మూడు, సైదులు, బుచ్చమ్మపై రెండు కేసులు, సాయి చరణ్ పై ఒక‌ కేసు ఉంది. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయంలో విచారణ చేస్తున్నాం’’ అని ఎస్పీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement