ఎమ్మెల్యేల కేసులో తుషార్‌ను టార్గెట్‌ చేసిన సిట్‌.. ఆయన ఎవరో తెలుసా? | SIT Called Tushar For Investigation In MLAs Purchase Case | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల కేసులో తుషార్‌ను టార్గెట్‌ చేసిన సిట్‌.. ఆయన ఎవరో తెలుసా?

Nov 17 2022 12:25 PM | Updated on Nov 17 2022 12:35 PM

SIT Called Tushar For Investigation In MLAs Purchase Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో పలు ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే నందుపై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేయగా.. ఈ వ్యవహారంతో లింకులు ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. ఫౌంహాస్‌ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన విచారణకు హాజరుకావాలని తుషార్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రామచంద్రభారతి, రోహిత్‌రెడ్డితో తుషార్‌ ఫోన్‌లో మాట్లాడారు. తుషార్‌కు బీజేపీ కీలక నేతలు సన్నిహితులు అంటూ ఫోన్‌ సంభాషణ కొనసాగింది. 

ఇక, గత లోక​్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడులో రాహుల్‌పై తుషార్‌ పోటీ చేశారు. మరోవైపు.. రెమా రాజేశ్వరి నేతృత్వంలో సిట్‌ బృందం కేరళలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రామచంద్రభారతి ప్రధాన అనుచరుడు జగ్గుస్వామి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, తుషార్‌ను రామచంద్రభారతికి పరిచయం చేసింది జగ్గుస్వామినే కావడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement