రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్‌ దుర్మరణం..  | SI And Driver Die In Road Accident At Eturnagaram | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్‌ దుర్మరణం.. 

May 3 2023 9:31 AM | Updated on May 3 2023 9:31 AM

SI And Driver Die In Road Accident At Eturnagaram - Sakshi

ఏటూరునాగారం: పోలీస్‌ వాహనం అదుపుతప్పి ఎస్సైతోపాటు ప్రైవేట్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మరో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జీడివాగు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌రావు, ఐజీ రవివర్మలు ములుగు జిల్లా వెంకటాపురం(కె) పోలీస్‌స్టేషన్‌ తనిఖీ చేశారు. 

అనంతరం భద్రాచలం వైపు వెళ్తుండగా ఏటూరునాగారం సెకండ్‌ ఎస్సై ఇంద్రయ్య(59).. ప్రైవేటు డ్రైవర్‌ రాజు(23), కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను తీసుకొని ఎస్కార్ట్‌గా వెళ్లారు. వాహనం అతివేగంగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడి, పల్టీలు కొట్టింది. ముందు కూర్చున్న ఎస్సై, డ్రైవర్‌ వాహనంలోంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఎస్సై ఇంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందారు. రాజు చెట్లపొదల్లో పడి మృతిచెందాడు. కానిస్టేబుల్‌ మెట్టు శ్రీనివాస్‌ వాహనంలో సీటును గట్టిగా పట్టుకొని ప్రాణాలను కాపాడుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన ఆయన తేరుకుని స్థానిక ఎస్సై రమే‹Ùకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శ్రీనివాస్‌ను ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: సర్పంచ్‌ కట్టించిన శ్మశానవాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం 

Advertisement
 
Advertisement
Advertisement