తగ్గనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు.. నేడు, రేపు వర్షాలు   | Scattered light rain today and tomorrow | Sakshi
Sakshi News home page

Telangana: తగ్గనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు.. నేడు, రేపు తేలికపాటి వర్షాలు  

Apr 22 2023 5:44 AM | Updated on Apr 22 2023 2:48 PM

Scattered light rain today and tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలుప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 39.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 21.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement