హైదరాబాద్‌లో రోబోట్ తయారీ: రామరాజు సింగం

The Robots Are Being Manufactured In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: కరోనా మానవ జీవన విధానంలో ఎన్నో మార్పులు తెచ్చింది. దీంతో అనేక పద్ధతులు మారాయి. టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. వాటిలో ఒకటి రోబోట్స్ వాడకం. ముఖ్యంగా హోటల్స్ లో రోబోస్ వాడకం బాగా పెరిగింది. చాలా హోటల్స్ హ్యూమన్ కాంటాక్ట్ కి బదులు రోబోస్ ని వాడి కస్టమర్స్ కి కరోనా నుంచి అభయం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిని గమనించిన రామరాజు సింగం అనే వ్యక్తి హైదరాబాద్‌లో విస్టాన్‌ నెక్స్ట్‌జెన్ అనే సంస్థ స్థాపించి రోబోలు ని తాయారు చెయ్యడం మొదలుపెట్టాడు.

గత 20 సంవత్సరాలుగా లండన్ లో స్థిరపడిన రామరాజు అక్కడ ఒక్కసారి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశాడు. ప్రధాని ఇచ్చిన పిలుపుతో స్వదేశానికి  వచ్చిన   ఆయన    దేశానికి  ఏదైనా చెయ్యాలి అని ఈ రోబోటిక్స్ కి సంబందించిన కంపెనీ పెట్టాడు. ఒక  రోబోని తయారు చేసి రెండు లక్షలకు అమ్ముతున్నారు. వేరే దేశాల్లో ఆరు లక్షలు పలికే రోబోలను ఇక్కడ రెండు లక్షలకే అమ్ముతున్నారు. చైనాకి ధీటుగా భారత్ మార్కెట్ ను నిలపాలనేది తన కల అని రామరాజు సింగం తెలిపారు. విస్టాన్‌ నెక్స్ట్‌జెన్ లో తయారైన రోబోలు  రకరకాల పనులు చేస్తూ మరమనిషి అనే పేరుకి కరెక్ట్ గా సూట్ అవుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top