
48గంటల్లోనే కేసును చేధించిన చిక్కడపల్లి పోలీసులు
25.8తులాల బంగారు ఆభరణాలు, రూ.23వేల నగదును స్వాదీనం
హైదరాబాద్: వివేక్‌నగర్‌లో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగుల ఇంట్లో చోరీ జరిగిన 48 గంటల్లోనే చిక్కడపల్లి పోలీసులు కేసును చేధించారు. ఆదివారం సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పావల్లి కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటకు చెందిన బ్రూస్‌లీపై ఈనెల 13న చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇతడిపై 64 కేసులు ఉన్నాయని తెలిపారు.
చిక్కడపల్లిలోని వివేక్‌నగర్‌లోని దిట్టకవి ఎన్‌క్లేవ్‌లో నివసించే రిటైర్డ్ ఉద్యోగులైన లక్ష్మీనారాయణ, రాజేశ్వరిల ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగిలించారు. రాయుడు చైతన్యసాయికుమార్‌తో కలిసి ఆభరణాలను విక్రయించాలని పథకం పన్నారు. ఇతడిపై సైతం దాదాపు 67 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8గంటల ప్రాంతంలో సెంట్రల్ జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు సుందరయ్య పార్క్ వద్ద వారిని పట్టుకున్నారు.
పోలీసులు తమ తీరులో విచారించడంతో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరచి జ్యూడీషియల్ కస్టడీకి తరలించామని తెలిపారు. వారి వద్ద నుంచి 25.8తులాల బంగారు ఆభరణాలు, రూ.23వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు. ప్రతి కాలనీలీ, అపార్ట్‌మెంట్‌లలో ప్రతి ఒక్కరూ సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ కోరారు. పోలీసులు కేసును చేధించడంతో పీపుల్స్‌పార్క్ రెసిడెన్స్ అసోసియేషన్ సభ్యులు పోలీసులకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి ఎసీపీ రమేష్ కుమార్, సీఐ రాజునాయక్, డీఐ శంకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.