వారు అహంకారం ప్రదర్శించారు: రేవంత్‌ రెడ్డి | Revanth Reddy’s Remarks on Governor’s Address | Sakshi
Sakshi News home page

వారు అహంకారం ప్రదర్శించారు: రేవంత్‌ రెడ్డి

Mar 18 2026 8:41 PM | Updated on Mar 19 2026 1:11 PM

 Revanth Reddy’s Remarks on Governor’s Address

హైదరాబాద్‌: అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగం తెలంగాణ అభివృద్ధికి విశిష్ఠ ప్రణాళిక అని అన్నారు. ప్రతిపక్షం ధన్యవాదాలు తెలుపుతుందని ఆశించామని, హుందాగా ప్రవర్తించకుండా అహంకారం ప్రదర్శించిందని అన్నారు.

‘ఎన్నో త్యాగాల ఫలితం మన దేశ స్వాతం‍త్య్రం. కాంగ్రెస్‌ పార్టీ సుదీర్ఘపోరాటంతో స్వాతంత్య్రం వచ్చింది. పేదవాడికి బ్యాంకింగ్‌ రంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఇందిరా గాంధీ. నెహ్రూ కట్టిన ప్రాజెక్టులను మనం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. బీఆర్‌ఎస్‌ ఇంకా అహంకార ధోరణి మార్చుకోలేదు. 

అభివృద్ధిలో కలిసి వస్తారనుకుంటే ప్రతిపక్షం అహంకారం చూపిస్తోంది. 4 కోట్లమంది ప్రజలను నిరాశపర్చేలా విపక్షాల తీరు ఉంది. అధికారం పోయినా రాచరిక పోకడలు పోలేదు. నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వాళ్ల తీరు మారలేదు. కొందరు తమను తాము రాజులనుకుంటున్నారు. ఇప్పటికీ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. 

‘దేవుళ్ల కాలం నుంచే మారీచుల రూపంలో అడ్డంకులు సృష్టించే వారు ఉన్నారు. చెరువులు, నాలాలు, ఫుట్‌పాత్‌లను కబ్జాల నుంచి కాపాడుతున్నాం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యతో ప‍్రజలు సతమతమవుతున్నారు. అందుకే హైదరాబాద్‌ను కాలుష్యం, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం’ అని తెలిపారు.’ అని రేవంత్‌​ రెడ్డి చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement