తెలంగాణలో రాహుల్ గాంధీ 370కి.మీ పాదయాత్ర

సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో పాదయాత్ర విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కోరారు. తెలంగాణలో అక్టోబర్ 24న మక్తల్ నియోజకవర్గంలో ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని శుక్రవారం ఒక ప్రకట నలో తెలిపారు. 13 నుంచి 15 రోజుల వరకు పాదయాత్ర సాగుతుందని, దీనిపై ఇప్పటికే రూట్ పరిశీలన జరిగిందన్నారు.
330 నుంచి 370 కి.మీ. యాత్ర తెలంగాణలో ఉండే అవకాశముందని వెల్లడించారు. దేశంలో ఐక్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలకు వివరించి ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు రాహుల్ భారత్ జోడో పాదయా త్రను ప్రారంభిస్తున్నారన్నారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి యాద్ర ప్రారంభం కానుందని బలరాం నాయక్ వివరించారు.
చదవండి:ఏడాది పొడవునా తెలంగాణ విలీన వజ్రోత్సవాలు!