వస్త్రోత్పత్తుల నాణ్యతనూ గుర్తించొచ్చు.. | The quality of textile products can also be identified. | Sakshi
Sakshi News home page

వస్త్రోత్పత్తుల నాణ్యతనూ గుర్తించొచ్చు..

Jan 30 2025 10:31 AM | Updated on Jan 30 2025 11:03 AM

The quality of textile products can also be identified.
  •  హైదరాబాద్‌లో బీఐఎస్‌ లేబొరేటరీ ప్రారంభం
  • కేంద్ర ప్రభుత్వ క్వాలిటీ కంట్రోల్‌ ఆర్డర్లలో కీలకం

సాక్షి, హైదరాబాద్‌: వస్త్రోత్పత్తుల నాణ్యతను పరిశీలించేందుకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) హైదరాబాద్‌లో లే»ొరేటరీని ప్రారంభించింది. వస్త్రోత్పత్తుల నాణ్యత పరిశీలనకే ప్రత్యేకించిన ఈ లే»ొరేటరీని బీఐఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రమోద్‌ కుమార్‌ తివారీ బుధవారం ప్రారంభించారు. టెక్స్‌టైల్‌ రంగంలో నాణ్యతా పరీక్షల వాతావరణాన్ని అత్యాధునిక సాంకేతికత, వసతులతో ఏర్పాటైన ఈ లే»ొరేటరీ బలోపేతం చేస్తుంది. ‘కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన క్వాలిటీ కంట్రోల్‌ ఆర్డర్లను సరఫరా చేయడంలో ఈ లే»ొరేటరీ కీలకంగా పనిచేస్తుంది. టెక్స్‌టైల్‌ ఉత్పత్తులు జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకునేలా చేయడంలో దీని పాత్ర అత్యంత కీలకం. త్వరలో నూలును పరిశీలించే సౌలభ్యం కూడా అందుబాటులోకి రానుంది.

వస్త్రోత్పత్తుల నాణ్యతను పరిశీలించేందుకు లే»ొరేటరీ ఏర్పాటైన ఇదే భవనంలో బంగారం నమూనాల స్వచ్ఛతను పరిశీలించే ప్రయోగశాల కూడా ఉంది. ఈ లే»ొరేటరీలో ఏర్పాటు చేసిన యూనివర్సల్‌ టెస్టింగ్‌ మెషీన్‌ (యూటీఎం) పరికరం ద్వారా వస్త్రోత్పత్తుల నాణ్యత, మన్నికను పరిశీలిస్తారు’అని తివారీ వెల్లడించారు. కార్యక్రమంలో బీఐఎస్‌ డిప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ (లేబొరేటరీస్‌) నిషత్‌ సుల్తానా, దక్షిణ ప్రాంత డిప్యూటీ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మీనాక్షి గణేశన్, హైదరాబాద్‌ బ్రాంచ్‌ ల్యా»ొరేటరీ హెడ్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎలా పనిచేస్తుంది...

యూనివర్సల్‌ టెస్టింగ్‌ మెషీన్‌లో వస్త్రాలకు ఉపయోగించే దారానికి కంట్రోల్డ్‌ టెన్సిల్‌ ఫోర్స్‌ను వినియోగిస్తారు, ఈ దారం తెగే వరకు లాగుతారు. ఎక్కడైతే దారం తెగుతుందో.. వినియోగించిన బలాన్ని లెక్కించి ఎంత నాణ్యమైందో రూఢీ చేసుకుంటారు. దీని ఆధారంగా మన్నిక, నాణ్యతను గుర్తిస్తారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement