ప్రభుత్వం విప్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన పుల్లెల | Pullela Gopichand Accepted Government Whip Guvvala Balaraju Challenge | Sakshi
Sakshi News home page

మహోద్యమంలా గ్రీన్‌ ఇండియా మిషన్‌ ఛాలెంజ్‌

Jul 25 2020 7:18 PM | Updated on Jul 25 2020 7:54 PM

Pullela Gopichand Accepted Government Whip Guvvala Balaraju Challenge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు ఇచ్చిన ఛాలెంజ్‌ను ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్  స్వీకరించారు. గ్రీన్‌ ఇండియా మిషన్‌ మూడో విడత కార్యాక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్‌ విసిరిన గ్రీన్‌ ఇండియా  ఛాలెంజ్‌ మహోద్యమంలా సాగుతోంది. ఈ నేపథ్యంలో గువ్వుల ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి గచ్చిబౌలిలలోని తన అకాడమీ ప్రాంగణంలో పుల్లెల గోపిచంద్ శనివారం‌ మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హరితహారం, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లతో రాష్ట్రంలో పచ్చదనం బాగా పెరిగిందన్నారు. అంతేగాక ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో కూడా పచ్చదనంపై చాలా అవగాహన పెరిగిందన్నారు. ఇక గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బ్యాడ్మింటన్‌ ప్లేయర్స్‌ సిక్కిరెడ్డి, మేఘన, అరుణ్‌, విష్ణులు మొక్కలు నాటాలని ఆయన పిలుపు నిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement