న్యూ ఇయర్‌ వేడుకలకు ఆంక్షల్లేవ్‌ 

Public Health Dr Srinivasa Rao Clarified Corona Cases In telangana - Sakshi

కరోనాతో ఇప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని వెల్లడి 

మద్యం విక్రయాలకు రాత్రి ఒంటి గంట వరకు అనుమతి  

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సంవత్సరం వేడుకలు, సంక్రాంతి పండుగలకు ఎలాంటి ఆంక్షలు లేవని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. చైనా వంటి దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నా, ఇక్కడ ఎలాంటి సమస్య లేదని తెలిపారు.  ప్రజలు  వేడుకలు జరుపుకోవడానికి జంకాల్సిన అవసరం లేదంటూ ఆయన గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఒమి­క్రాన్‌ వేరియంట్లను మనం గతంలో సులువుగా ఎదుర్కొన్నామనీ  దీంతో టెన్షన్‌పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీర్ఘకాలిక రోగులు, ఇతర హైరిస్క్‌ గ్రూప్‌లు మాత్రం కరో­నా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు. 

ఇక ఆంక్షలు లేకుండా వేడుకలు 
కాగా, న్యూఇయర్‌ ఈవెంట్లను ఈసారి ఘనంగా నిర్వహించుకునేందుకు వెసులుబాటు కలిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా కొత్త సంవత్సర వేడుకలు జరగడం గమనార్హం. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నారు. హోటళ్లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, ఫాంహౌస్‌లు, గేటెడ్‌కమ్యూనిటీ ఇళ్లు, రిసార్ట్‌లలో వేడుకల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. పైగా డిసెంబర్‌ 31న రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top