ప్రైవేటు టీచర్లకు కార్డు లేకున్నా రేషన్‌

Private Teachers Also Eligible Ration Scheme No Card Telangana - Sakshi

ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ

సిటీలో ప్రైవేట్‌ టీచర్లు 66వేల పైన

హెచ్‌ఎం ధ్రువీకరణే ప్రామాణికం

సాక్షి, సిటీబ్యూరో: కరోనా కష్టకాలంలో ఆహార భద్రత (రేషన్‌) కార్డు లేకున్నా.. రూ.2 వేల ఆర్థిక సాయం, 25 కిలోల రేషన్‌న్‌బియ్యానికి ప్రైవేట్‌ టీచర్లు అర్హులే. నగరంలో సగం మందికిపైగా ప్రైవేట్‌ టీచర్లకు రేషన్‌ కార్డు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో సంబంధం లేకుండా విద్యాసంస్ధల్లో మార్చి 2020 నాటికి జీతాలు చెల్లించిన రికార్డుల ఆధారంగా ప్రధానోపాధ్యాయుడు సమర్పించే ధ్రువీకరణ ప్రామాణికంగా ఆర్థిక సాయం అందజేసేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

రేషన్‌ కార్డు లేనివారికి వారి ప్రస్తుత చిరునామాతో రేషన్‌ పంపిణీ చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. శనివారం నుంచే ప్రైవేట్‌ పాఠశాలల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఉరుకులు పరుగులు అందుకుంటున్నారు.  

సగం ఇక్కడే.. 
రాష్ట్రం మొత్తంలో సగానికి పైగా ప్రైవేట్‌ విద్యా సంస్ధలు నగర పరిధిలోనే ఉన్నాయి. దీంతో ప్రైవేట్‌ టీచర్ల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువ. కరోనా నేపథ్యంలో విధుల నుంచి తొలగించిన వారి శాతం కూడా అధికమే. ఏడాది కాలంగా ఉపాధి లేక ప్రైవేట్‌ టీచర్ల కుటుంబాలు అలమటిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం ప్రైవేట్‌ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య లక్షన్నర పైగా ఉన్నట్టు తెలుస్తోంది. అత్యధికంగా లబ్ధిదారులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మూడు జిల్లాల్లో సుమారు 66 వేలకుపైగా ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

 ( చదవండి: జర చూస్కో! మాస్కు లేకుంటే 1000 పడుద్ది

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top