ఇకపై మండల స్థాయిలో ‘ప్రజావాణి’ | Prajavani will now be available at the mandal level | Sakshi
Sakshi News home page

ఇకపై మండల స్థాయిలో ‘ప్రజావాణి’

Aug 5 2026 4:47 AM | Updated on Aug 5 2026 4:47 AM

Prajavani will now be available at the mandal level

ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో.. ఉదయం 10 గంటల నుంచి    మధ్యాహ్నం 1 గంట దాకా నిర్వహణ 

ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజనల్‌ స్థాయిలలో ఏర్పాటు 

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై మండలాల స్థాయిలో ‘ప్రజావాణి’కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మండల పరిషత్‌ కార్యాలయం లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి మండల అభివృద్ధి అధికారి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రజావాణికి తహసీల్దార్‌ (ఎమ్మార్వో), ఎంపీవో, మండల స్థాయిలోని వ్యవసాయ, ఉద్యానవన, విద్యా, వైద్య, శిశుసంక్షేమ, రోడ్లు,భవనాలు ఇతర సంబంధిత శాఖల అధికారులు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మండల స్థాయిలో ప్రజా ఫిర్యాదులు, విజ్ఞప్తుల పరిష్కార యంత్రాంగాన్ని సంస్థాగతంగా వికేంద్రీకరించడం, ఏకీకరణ చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత జిల్లా, రెవెన్యూ డివిజనల్‌ స్థాయిలలో దీనిని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరింత వికేంద్రీకరణలో భాగంగా మండల స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రజావాణి పోర్టల్‌ను రూపొందించి దాని ద్వారా రిజి్రస్టేషన్, ప్రాసెసింగ్, మానిటరింగ్, రాష్ట్ర, జిల్లా, ఆర్డీవో స్థాయిల్లో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల సమీక్ష వంటి ప్రక్రియలు నిర్వహిస్తున్నారు.  

పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ 
ఇకపై మండల స్థాయిలో అందే ప్రతి ఫిర్యా దు, వినతులను ప్రజావాణి పోర్టల్‌లో రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుంది. పిటిషనర్‌ సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసి అక్నాలెడ్జ్‌మెంట్‌ రశీదు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసమే పనిచేసేలా ప్రతి ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్‌ కనెక్టివిటీతో ఓ ‘డెడికేటెడ్‌ గ్రీవెన్స్‌ రిజిస్ట్రేషన్‌’కౌంటర్‌ ఏర్పాటు చేసుకోవాలని సీఎస్‌ సూచించారు. ప్రజావాణి వేదిక వద్ద సీటింగ్, తాగునీరు, హెల్త్‌డెస్‌్క, వాష్‌రూమ్‌లు, వీల్‌ చెయిర్లు వంటి సదుపాయాలను నోడల్‌ అధికారులు కల్పించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్లు, గర్భవతులు, మహిళలు, చిన్నపిల్లల నుంచి ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తులను స్వీకరించాలని సీఎస్‌ సూచించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement