నేడు కేసీఆర్‌ పుట్టినరోజు.. స్పెషల్‌ వీడియోలు, ఫొటోలతో శుభాకాంక్షలు

Political Leaders And Celebrities Wished KCR On His Birthday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ట్విట్టర్‌ వేదికగా మాజీ మంత్రి హరీష్‌ రావు..‘తెలంగాణ స్పాప్నికుడు, స్వరాష్ట్ర సాధకుడు, సుపరిపాలకుడు, ఉద్యమ నేత కేసీఆర్. కారణజన్ముడుగా.. చిరస్మరణీయుడుగా, ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడుగా ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని ఫొటోలను షేర్‌ చేశారు. 

ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌లో..‘స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ కేసీఆర్‌ వీడియోను షేర్‌ చేశారు. 

ఇక, బీఆర్‌ఎస్‌ నేతలు, మద్దతుదారులు కూడా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు సంబంధించిన స్పెషల్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. 

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top