
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌హోమ్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. దీనిలో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు తాజా రాజకీయ అంశాలతో పాటు, అసెంబ్లీ సమావేశాలు, బీసీ బిల్లుల అంశాలను సీఎం రేవంత్ చర్చించారు.
బీసీ బిల్లు విషయాన్ని గవర్నర్ దగ్గర్ ఆరా తీశారు ముఖ్యమంత్రి రేవంత్. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు, పంచాయతీ ఎన్నికల విషయాలను గవర్నర్‌కు తెలిపినట్లు తెలుస్తోంది.