‘మేం ఓట్ల చోరీ చేస్తే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా?’ | BJP :Leader Bandi Sanjay Takes On Congress | Sakshi
Sakshi News home page

‘మేం ఓట్ల చోరీ చేస్తే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా?’

Aug 15 2025 9:42 PM | Updated on Aug 15 2025 9:45 PM

BJP :Leader Bandi Sanjay Takes On Congress

హైదరాబాద్:  బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడితే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్‌ గెలిచేదా అని ప్రశ్నించారు  కేంద్రమంత్రి, బండి సంజయ్‌. ఈరోజు(ఆగస్టు 15వ తేదీ) యూసఫ్‌గూడాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావుతో కలిసి తిరంగా ర్యాలీని ప్రారంభించారు బండి సంజయ్‌, దీనిలో భాగంగా మాట్లాడిన బండి సంజయ్‌,. ‘ మీరు మార్వాడీ గో  బ్యాక్‌ ఉద్యమాలు చేస్తే.. మేం హిందూ కుల వృత్తులను కాపాడుకునే ఉద్యమం చేస్తాం. రోహింగ్యాలు గో బ్యాక్‌ ఆందోళనలు చేస్తాం. 

మార్వాడీ గో బ్యాక్‌ ఉద్యమం అనేది హిందూ సమాజాన్ని చీల్చే మహా కుట్ర. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న డ్రామాలివి. పాతబస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చిన రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదు?, హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్, డ్రైక్లీన్ షాపులు ఒక వర్గం వారే నిర్వహిస్తుంటే నోరెందుకు మెదపరు?, రోహింగ్యాల గో బ్యాక్ ఉద్యమాలు చేస్తాం. ఓట్ల చోరీకి, బీజేపీకి ఏం సంబంధం?

మేం ఓట్ల చోరీ చేస్తే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా?,  ఇండీ కూటమికి 230 ఎంపీ సీట్లు వచ్చేవా?, కేంద్రంలో బీజేపీకి 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి?, రాహుల్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది’ అని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement