తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..

Published Sun, Feb 18 2024 10:48 AM

Police Dept 62 DSP Transfers in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఏకంగా 62 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు.

వివరాల ప్రకారం.. తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్‌ఫర్ చేయగా.. తాజాగా పోలీసు శాఖలో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఆదివారం 62 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. 

ఈ క్రమంలో డీజీ ఆఫీస్‌లో వెయిటింగ్‌లో ఉన్న డీఎస్పీలందరికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. తాజా బదిలీలతో తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది డీఎస్పీలు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. డీఎస్సీలతో పాటుగా హైదరాబాద్‌లో పలువురు ఏసీపీలను సైతం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు బదిలీలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement