Breadcrumb
Live Updates
మోదీ హైదరాబాద్ పర్యటన
సమతా కేంద్రంలో లేజర్ షోను తిలకించిన ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: ముచ్చింతల్‌లోని సమతా కేంద్రంలో ప్రధాని మోదీ లేజర్ షోను తిలకించారు. త్రీడి విధానంలో సాంస్కృతిక కార్యాక్రమాల ప్రదర్శన సాగింది.
తెలుగు సంస్కృతి దేశ భిన్నత్వాన్ని బలోపేతం చేస్తోంది: ప్రధాని మోదీ

సాక్షి, హైదరాబాద్: సమాజంలోని అందరికీ సమాన అవకాశాలు దక్కాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అదరూ సమానంగా అభివృద్ధి చెందాలని అన్నారు. సబ్కా సాథ్.. సబ్కా వికాస్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఉజ్వల్ పథకం, జన్‌ధన్, స్వచ్ఛ్ భారత్ వంటి పథకాలన్నీ అందులో భాగమేనని తెలిపారు
‘దేశ ఏకతకు రామానుజాచార్యులు స్ఫూర్తి. దేశమంతటా రామానుజాచార్యులు పర్యటించారు. స్వాతంత్ర్య పోరాటం కేవలం దేశ ప్రజల అధికారం కోసమే కాదు. తెలుగు సంస్కృతి దేశ భిన్నత్వాన్ని బలోపేతం చేస్తోంది. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు తెలుగు సంస్కృతిని పోషించారు. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. పోచంపల్లికి ప్రంచ వారసత్వ గ్రామంగా ఘనత దక్కింది. తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైంది’ అని పేర్కొన్నారు.
రామానుజాచార్య ఆదర్శాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి: మోదీ
సాక్షి, హైదరాబాద్: రామానుజాచార్యుల విగ్రహం జ్జానం, ధ్యానానికి ప్రతీక అని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయమన్నారు. రామానుజాచార్యుల విగ్రహం ఆయన ఆదర్శాలకు ప్రతీక అని, దేశ సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా రామానుజాచార్యుల ప్రవచనాలనే చెప్పారని గుర్తు చేశారు.
‘మనిషి జీవితంలో గురువు అత్యంత కీలకం. గురువే ధ్యాన కేంద్రం. 108 దివ్య దేశ మందిరాలను ఇక్కడ చూశాను. దేశమంతా తిరిగి దేవాలయాలను చూసిన అనుభూతి కలిగింది. సమాజంలో అంతరాలను రామానుజాచార్య ఆనాడే తొలగించారు. అందరినీ సమానంగా చూశారు. ఆయన ఆదర్శాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. రామానుజాచార్యులు దళితులను ఆలయ ప్రవేశం చేయించారు. మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారు. రామానుజాచార్యుల సమతాసూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి.’ అని పేర్కొన్నారు.
గురువును దేవుడితో కొలవడం భారతదేశ గొప్పతనం: ప్రధాని మోదీ

సాక్షి, హైదరాబాద్: ముచ్చింతల్‌లోని 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ వసంతపంచమి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజే రామానుజాచార్య విగ్రహావిష్కరణ జరిగిందని తెలిపారు. మనిషి జీవితంలో గురువు అత్యంత కీలకమని పేర్కొన్నారు. మనం గురువును దేవుడితో కొలుస్తామని, ఇది మన భారతదేశ గొప్పతనమని అన్నారు.
రామానుజాచార్య సమతాస్ఫూర్తిని ప్రధాని అమలు చేస్తున్నారు: కిషన్ రెడ్డి

సాక్షి, హైదరాబాద్: సర్వ మానవ సౌభ్రాతత్వం భారతదేశ లక్షణమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వెయ్యేళ్ల క్రితమే సమానత్వ భావనను రామానుజాచార్యులు చెప్పారని గుర్తు చేశారు. దివ్యక్షేత్రం కోసం చినజీయర్ స్వామి భక్తులందరిని ఏకం చేశారని, రామానుజాచార్య సమతాస్ఫూర్తిని ప్రధాని అమలు చేస్తున్నారని అన్నారు.
శ్రీరాముడిలా మోదీ కూడా గుణసంపన్నుడు: చినజీయర్ స్వామి

సాక్షి, హైదరాబాద్: ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. శ్రీరాముడు వ్రత సంపన్నుడని కొనియాడారు. శ్రీరాముడిలా మోదీ కూడా గుణసంపన్నుడని ప్రశంసించారు. మోదీ ప్రధాని అయ్యాకే దేశ ప్రజలు హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారన్నారు. మోదీ ప్రధాని అయ్యాక భరతమాత తలెత్తుకొని చిరునవ్వులు చిందస్తోందని పేర్కొన్నారు.
సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

సాక్షి, హైదరాబాద్: ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. రామానుజ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. 120 కిలోల స్వర్ణ శ్రీమూర్తికి ప్రధాని మోదీ పూజలు నిర్వహించారు.
సమతామూర్తి విగ్రహ ప్రాంగనానికి మోదీ

సాక్షి, హైదరాబాద్: ముచ్చంతల్‌లోని యాగశాలలో ప్రధాని మోదీ ప్రధాని పూజలు చేశారు. తిరునామం, పట్టు వస్త్రాల్లో వచ్చిన మోదీ వేద పండితుల్ని అనుకరించారు. ప్రధానిమోదీతో రుత్వికులు సంకల్పం చేయించారు. చినజీయర్ స్వామి ఇచ్చిన కంకణాన్ని మోదీ ధరించారు. అనంతరం సమతామూర్తి విగ్రహ ప్రాంగనానికి మోదీ చేరుకున్నారు. సమతాస్ఫూర్తి కేంద్రంలో 108 దివ్య దేశాలను సందర్శించారు. 108 దివ్య దేశాల విశిష్టతను చినజీయర్ స్వామి ప్రధానికి వివరించారు. రామానుజ జీవిత చరిత్ర విశేషాల గ్యాలరీని సందర్శించారు.
సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

సాక్షి, హైదరాబాద్: ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధానిమోదీ చేరుకున్నారు. ముచ్చింతల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చినజీయర్‌స్వామి స్వాగతం పలికారు. తిరునామాలు, పంచెకట్టుతో ప్రధాని మోదీ శ్రీ లక్ష్మీనారాయణ హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు.
కాసేపట్లో ముచ్చింతల్‌కు ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేరుకోనున్నారు. సమతామూర్తి స్ఫూర్తికేంద్రలో మూడుగంటలపాటు ఉండనున్నారు. శ్రీలక్ష్మి నారాయణ హోమం పూర్ణాహుతిలో పాల్గొననున్నారు. సమతామూర్తి కేంద్ర విశిష్టతను ప్రధాని మోదీకి చినజీయర్ స్వామి వివరించనున్నారు. రామానుజాచార్య విగ్రహం, యాగశాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్ల దర్శనం, విష్వక్సేనుడి యాగంలో పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు.
మైక్రో ఇరిగేషన్‌ను మరింత ప్రోత్సహించాలి: ప్రధాని మోదీ
ఇక్రిశాట్ 50 ఏళ్ల ప్రయాణంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు: ప్రధాని మోదీ

సాక్షి, హైదరాబాద్: ఇక్రిశాట్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. అందరికీ ఇక్రిశాట్ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్రిశాట్ 50 ఏళ్ల ప్రయాణంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు. అజాదీ అమృతోత్సవాల వేళ ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు జరుపుకుంటుందని పేర్కొన్నారు. ‘ఇక్రిశాట్ సేవలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. టెక్నాలజీని మార్కెట్‌తో జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్ కృషి చేస్తోంది. వాతావరణ పరిశోధన కేంద్ర రైతులకు ఎంతో ఉపయోగకరం. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మానవ నష్టం గురించి చర్చిస్తాం. కానీ మౌలిక సదుపాయలకు జరిగిన నష్టం గురించి మాట్లాడం. వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రపంచస్థాయి పరిశోధలనకు భారత్ వేదికగా మారింది. ఇందుకోసం భారత్ ఎన్నో చర్యలు తీసుకుంది. ఈ పరిశోధనలు చిన్న, మధ్య తరగతి రైతులకు ఎంతో ఉపయోగకరం’ అని పేర్కొన్నారు.
ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఇక్రిశాట్లో పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. అందరికీ ఇక్రిశాట్ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్రిశాట్ 50 ఏళ్ల ప్రయాణంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు.
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలను పూర్తిచేసుకోవడం స్పూర్తిదాయకం: కేంద్రమంత్రి తోమర్
సాక్షి, హైదరాబాద్: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలను పూర్తిచేసుకోవడం స్పూర్తిదాయకమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ శాస్త్రవేత్తలకు శుభాభినందనలు తెలిపారు. మోదీ ప్రధాని అయ్యాక ప్రతి ఏడు బడ్జెట్లో దేశానికి ఒత్త దిశ సూచిస్తున్నారని, వచ్చే 25 ఏళ్లకు మార్గదర్శనం చేసేలా ఈసారి బడ్జెట్ రూపొందించారని తెలిపారు. ఈ దేశానికి రైతులు, వ్యవసాయం చాలా ప్రాధానమైనవని, ఒకప్పుడు జైజవాన్.. జైకిసాన్ అనేవారని ప్రస్తావించారు. వాజ్‌పేయి ప్రధాని అయ్యాక విజ్జాన్ను దానికి జోడించారని, నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక జై అనుసంధాన్ కూడా దానికి జోడించారని అన్నారు.
ఇక్రిశాట్లో ప్రధాని మోదీ పర్యటన
సాక్షి, హైదరాబాద్: ఇక్రిశాట్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఇక్రిషాట్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను శాస్త్రవేత్తలు ప్రధానికి వివరిస్తున్నారు. కొత్త వంగడాలను ఇక్రిశాట్లో ఎలా ఉత్పత్తి చేస్తున్నారో వివరిస్తున్నారు. వర్షపు నీటి నిర్వహణపై వీడియోను మోదీ తిలకించారు. ప్రధానికి ఇక్రిశాట్ డైరెక్టర్ జ్ఞాపికను అందజేశారు.
ఇక్రిశాట్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక్రిశాట్‌కు చేరుకున్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలలో మోదీ పాల్గొన్నారు. ఇక్రిషాట్ కొత్త లోగోలను ప్రధాని ఆవిష్కరిస్తారు. ఇక్రిశాట్లో 7 నిమిషాలపాటు పంటల క్షేత్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం శాస్త్రవేత్తలను ఉద్ధేశించి 10 నిమిషాలు ప్రసంగిస్తారు.
I look forward to being in Hyderabad today to take part in two programmes. At around 2:45 PM, I will join the 50th Anniversary celebrations of ICRISAT, an important institution that works on aspects relating to agriculture and innovation.
— Narendra Modi (@narendramodi) February 5, 2022
హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జ్వరం కారణంగా సీఎం కేసీఆర్ ప్రధాని స్వాగత కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ తమిళ సై

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయనకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలకడానికి తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
కాసేపట్లో హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

ముచ్చింతల్‌లో జరిగే రామానుజుల సహస్రాబ్ది వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
షెడ్యూల్ ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం మోదీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివార్లలోని ఇక్రిశాట్ (అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం)కు చేరుకుని సంస్థ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
ఇక్రిశాట్ వేడుకల తర్వాత ప్రధాని మోదీ ముచ్చింతల్‌లో జరిగే రామానుజుల సహస్రాబ్ది వేడుకల ప్రాంగణానికి వస్తారు. ఇక్కడ కార్యక్రమాలు పూర్తయ్యాక శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి ఢిల్లీకి బయలుదేరుతారు.
మోదీ షెడ్యూల్ ఇలా..

సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం 2:10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా హెలికాప్టర్లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు వెళతారు. సాయంత్రం 4:15 వరకు స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్రిశాట్ నూతన లోగోను ఆవిష్కరిస్తారు. తర్వాత శనగ వంగడాల క్షేత్రాన్ని పరిశీలిస్తారు.
సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి చేరుకుంటారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక.. యాగశాలలో పూర్ణాహుతి, విశ్వక్సేన ఇష్టి హోమంలో పాల్గొంటారు. తర్వాత దివ్యక్షేత్రాలను, రామానుజుల బంగారు విగ్రహం ప్రతిష్టాపన స్థలాన్ని పరిశీలిస్తారు.
సాయంత్రం 6.15 గంటల నుంచి రామానుజుల భారీ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఆవిష్కరిస్తారు. సుమారు 7 గంటల సమయంలో ప్రసంగం చేస్తారు. అనంతరం రుత్విక్కుల నుంచి వేదాశీర్వచనం, చినజీయర్ స్వామి నుంచి మహా ప్రసాదాన్ని అందుకుంటారు. రాత్రి 8:25 గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.
At 5 PM, I will join the programme to inaugurate the ‘Statue of Equality.’ This is a fitting tribute to Sri Ramanujacharya, whose sacred thoughts and teachings inspire us. https://t.co/i6CyfsvYnw
— Narendra Modi (@narendramodi) February 5, 2022
Related News By Category
Related News By Tags
-
సమతాస్ఫూర్తికి ప్రాణప్రతిష్ట.. వైభవంగా అంకురార్పణ కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: దేశంలో భారీ ఆధ్యాత్మిక, ధార్మిక కేంద్రాల్లో ఒకటిగా భాసిల్లే స్థాయిలో రూపు దిద్దుకున్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభోత్సవానికి బుధవారం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైం...
-
ఆయన వస్తారో.. రారో చూడాలి: చిన్న జీయర్ స్వామి
సాక్షి, హైదరాబాద్: ముచ్చింతల్‌లో రేపు (శనివారం) శాంతి కల్యాణం జరగనుందని చినజీయర్ స్వామి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 108 దివ్యదేశాల ఆలయాల్లో మూర్తులకు శాంతి కల్యాణం జరుగుతుందని పేర్...
-
శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ సమానత్వానికి నిలువెత్తు చిహ్నం: మోదీ
సాక్షి, హైదరాబాద్:‘‘జగద్గురు రామానుజాచార్యుల బోధనలు, ఆయన చాటిన ఆధ్యాత్మిక చైతన్యమే వేల ఏళ్ల బానిసత్వంలోనూ భారతీయులను చైతన్యవంతులుగా నిలిపాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. ఆయన చూపిన మార్గం ప...
-
PM Narendra Modi : తెలుగు సినిమాపై ప్రధాని మోదీ కామెంట్స్ వైరల్
PM Narendra Modi Appreciates Telugu Cinemas: తెలుగు సినిమాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందన్నారు. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహా...