ప్రధానిపై పాటకు ఆటోగ్రాఫ్‌.. | PM Modi Gift To Bandaru Dattatreya Grand Daughter During Public Meeting In Hyderabad, Video Viral| Sakshi
Sakshi News home page

ప్రధానిపై పాటకు ఆటోగ్రాఫ్‌..

Published Sat, May 11 2024 9:37 AM | Last Updated on Sat, May 11 2024 10:46 AM

PM Modi Gift To Bandaru Dattatreya Grand Daughter

బండారు దత్తాత్రేయ మనవరాలు  

జశోధరకు మోదీ అభినందన... 

సాక్షి, హైదరాబాద్: హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మనవరాలు జశోధర (6) తనపై ప్రత్యేకంగా పాడిన పాటను గుర్తుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన కూతురు పాడిన పాటను మోదీ రీట్వీట్‌ చేసిన విషయాన్ని ప్రస్తావించగా..మోదీ స్పందించి త్వరలో జశోధరను కలుస్తానని తెలిపారు. అంతేకాకుండా మోదీ రీట్వీట్‌ చేసిన స్క్రీన్‌షాట్‌ ఫొటోగ్రాఫ్‌ పైన ఆటోగ్రాఫ్‌ ఇచ్చి ఆమెను అభినందించారు. తన ఇద్దరు కూతుర్లు జశోధర, వేదాన్షీ మోదీ పైన ప్రత్యేకంగా పాటలు పాడారని విజయలక్ష్మి ప్రధానికి తెలిపారు.  
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement