Photo Feature: ఒకే గదిలో బోధన.. వసతి

Photo Feature: Tribal Welfare Residential School Rooms Shortage Adilabad - Sakshi

ఆదిలాబాద్‌ జిల్లా బేలలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరు నుంచి పది తరగతులకు 12 గదులు మాత్రమే ఉన్నాయి. అందులో ఆరు గదులను తరగతి గదులకు, రెండు గదులను విద్యార్థుల వసతికి కేటాయించారు. మిగతా నాలుగు గదులను ఆఫీస్, స్టోర్, ల్యాబ్, వంటకు ఉపయోగిస్తున్నారు. అయితే 267 మంది విద్యార్థులు పడుకునేందుకు రెండు గదులు సరిపోకపోవడంతో, తరగతి గదులనే వసతికీ వాడుతున్నారు. వాటిలోనే విద్యార్థులు రాత్రిపూట పడుకుంటున్నారు. ఉదయం ఆ గదుల్లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు.

విద్యార్థులెవరైనా అనారోగ్యానికి గురైతే.. ఇదిగో ఇలా పాఠాలు బోధిస్తున్న గదిలోనే విశ్రాంతి తీసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, అదనపు తరగతి గదులను నిర్మించి, తమ అవస్థలు తొలగించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. (క్లిక్: ఓయూలో ఐడియాలకు ఆహ్వానం)
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top