ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అడిషనల్‌ ఎస్పీలకు రిమాండ్‌ | Phone Tapping Case: Police Ready For Another Arrest | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అడిషనల్‌ ఎస్పీలకు రిమాండ్‌

Apr 2 2024 8:38 AM | Updated on Apr 2 2024 12:04 PM

Phone Tapping Case: Police Ready For Another Arrest - Sakshi

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతున్న వేళ.. 

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్టైన అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు నాంపల్లి క్రిమినల్‌ కోర్టు రిమాండ్‌ విధించింది. దీంతో వాళ్లిద్దరినీ చెంచల్‌గూడ జైలుకు తరలించారు. 

అంతకు ముందు.. వాళ్లిద్దరి కస్టడీ ముగియడంతో తొలుత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా.. ఈ నెల 6వ తేదీ దాకా రిమాండ్‌ విధించింది కోర్టు.  

ఇక ఈ ఇద్దరు నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన అధికారులు.. మరికొందరిని అరెస్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోపక్క.. మాజీ డీసీపీ రాధా కిషన్‌రావు రిమాండ్‌ రిపోర్టులో మరో అధికారి వేణుగోపాలరావును ప్రస్తావించారు పోలీసులు. దీంతో.. ఆయన్ని సైతం అరెస్ట్‌ చేస్తారా? లేదంటే నోటీసులిచ్చి కేవలం ప్రశ్నిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.  

రాధాకిషన్‌రావును పదిరోజుల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు.. ట్యాపింగ్‌ కేసులో ప్రణీత్‌రావు వేసిన బెయిల్‌ పిటిషన్‌పైనా ఇదే కోర్టులో విచారణకు రానుంది. ఇంకోపక్క..  తీగ లాగితే డొంక కదిలినట్లు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందుతుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement