ఒకవేళ విద్యార్థులకు కరోనా సోకితే.. | Parents Will Take Responsibility After Student Gets Corona | Sakshi
Sakshi News home page

చికిత్స బాధ్యత తల్లిదండ్రులదే.. 

Jan 24 2021 8:59 AM | Updated on Jan 24 2021 8:59 AM

Parents Will Take Responsibility After Student Gets Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల/ కళాశాలకు వచ్చే సందర్భంలో విద్యార్థి కరోనా బారినపడితే తల్లిదండ్రులే ప్రత్యేక చొరవ తీసుకుని వైద్య చికిత్స అందించే బాధ్యత తీసుకుంటామనే హామీ ఇవ్వాలి. లేకుంటే అధికారుల పర్యవేక్షణలో చికిత్సకు సమ్మతిస్తున్నట్లు స్పష్టం చేయాలి. కోవిడ్‌–19 నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే విద్యార్థిని మాన్యువల్‌ తరగతులకు అనుమతిస్తారు. ఈ అంశాలతో కూడిన హామీ పత్రంపై విద్యార్థి తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇచి్చన సూచనల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, గురుకుల సొసైటీలు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశాయి.

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తొమ్మిది, ఆపై తరగతులకు ప్రత్యక్ష విద్యాబోధనను ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం విద్యార్థులను పాఠశాల/ కళాశాలకు అనుమతిచ్చే తల్లిదండ్రులు తప్పకుండా అంగీకార పత్రం (కన్సెంట్‌ లెటర్‌) ఇవ్వాలనే నిబంధన పెట్టిన విషయం తెలిసిందే. ఈ అంగీకారపత్రంలో విద్యార్థి, తల్లిదండ్రుల వివరాలుంటాయి. అదేవిధంగా విద్యారి్థకి ఏవేనీ అనారోగ్య సమస్యలుంటే అందులో పేర్కొనాలి. ఏదైనా అనారోగ్యానికి చికిత్స తీసుకుంటుంటే అందుకు సంబంధించిన మందులను వెంట తెచ్చుకోవాలి. 

హాజరు తప్పనిసరి కాదు... 
వచ్చేనెల ఒకటి నుంచి విద్యా సంస్థలు పాక్షికంగా తెరుచుకోనున్నప్పటికీ విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆసక్తి ఉన్న... పరిస్థితులు అనుకూలించిన... ముఖ్యంగా తల్లిదండ్రులు సమ్మతి తెలిపిన విద్యార్థులు మాత్రమే తరగతులకు (ప్రత్యక్ష విద్యాబోధనకు) హాజరు కావొచ్చనే వెసులుబాటు కల్పించింది. తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రాలపై సంతకాలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేస్తూ... అందుకు సంబంధించిన నమూనాలను వసతిగృహ సంక్షేమాధికారులు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లకు పంపించారు.

ప్రత్యక్ష బోధన మొదలైనా, స్కూళ్లకు రావొద్దని నిర్ణయించుకున్న వారికోసం యథావిధిగా ఆన్‌లైన్‌ బోధన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేవలం విద్యార్థుల హాజరు సమాచారం కోసం మాత్రమే అటెండెన్స్‌ సేకరిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల అటెండెన్స్‌ను పరిగణనలోకి తీసుకోరని ఉన్నత విద్యాశాఖ అధికారి తెలిపారు. వార్షిక పరీక్షలకు అనుమతించడానికి, నిర్దిష్ట హాజరుశాతం ఉండా లనే  నిబంధనను ఈ విద్యా సంవత్సరానికి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement