210 మంది చిన్నారులకు విముక్తి  | Operation Muskan is ongoing across the state | Sakshi
Sakshi News home page

210 మంది చిన్నారులకు విముక్తి 

Jul 10 2023 3:05 AM | Updated on Jul 10 2023 7:37 AM

Operation Muskan is ongoing across the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులుగా మారిన చిన్నారులను కనిపెట్టేందుకు జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్‌ ముస్కాన్‌–9 స్పెషల్‌ డ్రైవ్‌ రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, కూడళ్లు, ఇటుక బట్టీ­లు, ఖార్ఖానాలు తదితర ప్రాంతాల్లో ఈ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరు రోజుల్లో మొత్తం 210 మంది చిన్నారుల జాడను అధికారులు గుర్తించారు.

వీరిలో సైబరాబాద్‌ పోలీ­స్‌ కమిషనరేట్‌ పరిధిలో 125 మంది, వికారాబాద్‌లో 14, ఆదిలాబాద్‌లో 12, నిజామాబాద్‌లో 8, వరంగల్‌లో 11, నల్లగొండలో 9, నారాయణపేట్‌లో 8 మంది, భూపాలపల్లిలో ఏడుగురు, కామారెడ్డిలో ఇద్దరు, మహబూబాబాద్‌లో ఇద్దరు, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇద్దరు, మెదక్‌లో నలుగురు, భద్రాద్రి కొత్తగూడెంలో నలుగురు, ఆసిఫాబాద్‌లో ఇద్దరు చొప్పున చిన్నారుల జాడను గుర్తించినట్టు అధికారులు తెలిపారు.

కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఏటా జూలైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో పోలీసులతోపాటు మహిళా, శిశు సంక్షేమం, ఆరోగ్య, వైద్య, కార్మిక, రెవెన్యూ శాఖల నుంచి అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement