
హైదరాబాద్: ప్రతీ ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగా అవలంభించి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉచిత యోగా శిక్షణ ఇస్తుంది బారతీయ యోగా సంస్థ.. దీనిలో భాగంగా అక్టోబర్ 12వ తేదీ, ఆదివారం నాడు ఈ సంస్థ 59వ వార్షిక వేడుకల్ని పురస్కరించుకుని ఒక రోజు ఉచిత యోగా శిక్షణను నిర్వహిస్తోంది..
హైదరాబాద్‌లోని ఆటోనగర్ సమీపంలోని హరిణి వనస్థలి పార్కు ఇందుకు వేదిక కానున్నట్లు డిస్ట్రిక్ట్ 2 అధ్యక్షులు వెంకటేశ్వర్లు గౌడ్, కార్యదర్శి ఆర్. యాదగిరి తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ , మోటివేషన్ స్పీకర్ వెంకటరెడ్డి, భారతీయ యోగా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ కులకర్ణి,, కార్యదర్శి సదానంద చారి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు జోనల్ సెక్రటరీలు సెంటర్ ఇంచార్జులు సహా సుమారు 400 మందిచే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రేపు(ఆదివారం) ఉదయం గం. 5.30 ని.ల నుంచి ఈ ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది.