తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్‌ కేసులు | Omicron Variant New Cases Detected In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్‌ కేసులు

Dec 21 2021 8:26 PM | Updated on Dec 21 2021 8:39 PM

Omicron Variant New Cases Detected In Telangana - Sakshi

తెలంగాణలో  ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, మరో నాలుగు కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, మంగళవారం మరో నాలుగు కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 24 కు చేరింది.

ఒమిక్రాన్‌ సోకిన వారంతా.. రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వారేనని తెలుస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్‌  వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మాస్క్‌ నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా, ప్రజలు  కరోనా నిబంధలను విధిగా పాటించాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. 

చదవండి: విమానాశ్రయంలో నిబంధనలు కఠినతరం

చదవండి:  తెలంగాణలో 20 మంది బాధితుల్లో నలుగురికి సీరియస్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement