కష్టాలు తొలగిస్తానని నగ్న చిత్రాలు తీసి.. ఆపై వ్యభిచారంలోకి! ఫిజిక్‌ను బట్టి రేటు ఫిక్స్‌ 

Old City Fake Baba Arrest: Women Trapped Into Brothel House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో బయటపడ్డ ఫేక్‌ బాబా అరెస్ట్‌ వ్యవహారంలో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు సయ్యద్‌ హుస్సేన్‌. వాళ్ల కష్టాలు తీర్చే శక్తి తనకుందని నమ్మబలుకుతూ.. నిస్సహాయత ఆసరాగా చేసుకుని వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. 

ఫలక్ నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహిళల నగ్న వీడియోలు, ఫోటోలను తీసిన సయ్యద్‌ హుస్సేన్‌(35)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ‘డెకాయ్ ఆపరేషన్’ చేపట్టి.. అదుపులోకి తీసుకున్నాడు.  నిందితుడు మొబైల్ ఆధారంగా కీలక సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. నిందితుడు సయ్యద్ హుస్సేన్ లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. అతని స్వస్థలం కర్నాటక బీదర్‌ జిల్లా బసవకళ్యాణ్‌. కలబురిగి(గుల్బర్గా)లో ఉన్న గులాం అనే వ్యక్తి తనను పంపించినట్టు చెప్తున్నాడు సయ్యద్. 

మానసికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలు, యువతులు రోగాలు తొలగిస్తాము అని మాయమాటలు చెప్పి నగ్నంగా వాళ్లను ఫోటోలను తీశాడు సయ్యద్. ఈ మేరకు సయ్యద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌ నుంచి గ్యాలరీని పరిశీలించారు పోలీసులు. అంతేకాదు.. గులాం తో సయ్యద్ చాట్ చేసిన కొన్ని వాట్సప్ చాటింగ్స్‌ను పరిశీలించినట్లు వెల్లడించారు. అయితే..  ఆ ఫోటోలను ఎక్కడికి పంపిస్తున్నాడు అనే దానిపై విచారణ జరుగుతున్నట్లు ఫలక్‌నుమా ఏసీపీ జహంగీర్‌ వెల్లడించారు. గుల్బర్గాలో ఉన్న గులాం గురించి సెర్చ్‌ టీమ్స్ ను పంపించినట్లు తెలిపిన ఆయన.. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయాలని కోరుతున్నారు. 

ఫిజిక్‌ను బట్టి రేటు.. 
తన దగ్గరకు వచ్చే మహిళలను అందరినీ సయ్యద్‌ హుస్సేన్‌ టార్గెట్‌ చేయడం లేదు. ఆకర్షణీయంగా ఉండే ఫిజిక్‌ను బట్టే వాళ్లను రప్పించుకుంటున్నాడు. ముఖం.. కాళ్లు మినహాయించి కేవలం శరీరాన్ని మాత్రమే నగ్నంగా చిత్రీకరించి పంపినట్లు తెలుస్తోంది.  ఒక సామాజిక కార్యకర్త ధైర్యం చేసి ఈ వ్యభిచార ముఠాను వెలుగులోకి తేగలిగారు. కలబురిగి ప్రాంతానికి గులాం.. వ్యభిచార గృహాల నిర్వాహకుడిగా ఓ అంచనాకి వచ్చారు. గులాం చెబితే.. వారం కిందట హుస్సేన్‌ పాతబస్తీ చేరాడు. బార్కస్‌ ఉంటున్న తన మరదలి ఇంట్లో అద్దెకు దిగాడు.  ఫలక్‌నుమా వట్టెపల్లికి చెందిన ఓ మహిళతో కలసి వ్యభిచార కార్యకలాపాలకు అనువుగా ఉండే యువతుల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు.

కష్టాలు తొలగించే ఉపాయం తన వద్ద ఉందంటూ తన దగ్గరకు వచ్చే మహిళలకు, యువతులకు మాటలతో గాలం వేసేవాడు. తన గదిలో వాళ్లను నగ్నంగా ఫొటోలు తీశాడు. వాళ్ల శరీర సౌష్టవాన్ని బట్టి గులాం వారికి ధర నిర్ణయించేవాడని వాట్సాప్‌ ఛాటింగ్‌ల ఆధారంగా తేలింది. అలా వారం రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా మహిళల వివరాలు కలబురిగి చేరవేశాడు. వీరిలో పాతబస్తీకి చెందిన ఇద్దరు యువతులున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top