
తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ (డీట్) గుర్తింపు ఫౌండేషన్, వీవ్ మీడియా ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ హైడియాథన్ స్టార్టప్ కాంపిటీషన్ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా హైడియాథన్ పోస్టర్ లాంచ్ స్థానిక డీట్ ఆఫీసు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. పోస్టర్ ఆవిష్కరణలో డీట్ డైరెక్ట్ ఈ ఆర్ జనార్దన్ రెడ్డి , అడిషనల్ డైరెక్టర్ పీఆర్ వంశీ, వీవ్ మీడియా టీం లాంచ్ చేశారు. వీ హబ్ సీఈఓ సీత చేతుల మీదుగా వీ హబ్‌లో లాంచింగ్ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా 18-30 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్, యువ ఇన్నోవేటర్స్ ఈ కాంపిటీషన్ పాల్గొనవచ్చని ఫౌండేషన్ డైరెక్టర్ నరేంద తెలిపారు. విజేతలకు ప్రైజ్ మనీతో పాటు , అప్ స్కిల్లింగ్, ఇంకుబేషన్ సపోర్ట్, ఫండింగ్ సపోర్ట్ అందిస్తున్నామని ‘గుర్తింపు ఫౌండేషన్’ డైరెక్టర్ నరేంద తెలిపారు.