కొడుకుపై కోపంతో 82 ఏళ్ల తల్లి నామినేషన్‌  | Sakshi
Sakshi News home page

కొడుకుపై కోపంతో 82 ఏళ్ల తల్లి నామినేషన్‌ 

Published Wed, Nov 8 2023 4:35 AM

Nomination of 82 year-old mother, angry with her son - Sakshi

జగిత్యాల: ఆమె 82 ఏళ్ళ వృద్ధురాలు .. భర్త స్వాతంత్య్ర సమరయోధుడు.. కుమారుడు విదేశాలకు వెళ్లి వచ్చాడు.. కానీ తల్లికి చెందిన భూమిని ఆమెకు తెలియకుండానే అమ్మేసుకున్నాడు. దాంతో ఆమె అద్దె ఇంట్లో ఉంటూ అష్టకష్టాలు పడుతూ.. న్యాయం చేయాలని ఏకంగా సీఎం కేసీఆర్‌కు సైతం లేఖ రాసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తే పదిమందికీ తెలిసి తన సమస్య పరిష్కారం అవుతుందని ఆ పెద్దావిడ భావించి నామినేషన్‌ వేశారు.

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు చీటి మురళీధర్‌ భార్య, 82ఏళ్ల చీటి శ్యామల మంగళవారం జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసి తన గోడును వెళ్లబోసుకున్నారు. పెద్ద కుమారుడు శ్రీరామ్‌ విదేశాలకు వెళ్లి వచ్చి తమకు తెలియకుండానే తమ స్థలాన్ని అమ్ముకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిపై నిరసనగా.. తన సమస్య పరిష్కారం కావాలనే నామినేషన్‌ వేశానని ఆమె చెప్పుకొచ్చారు. 
  

Advertisement
 
Advertisement
 
Advertisement