పురపోరు.. ముగిసిన ప్రచారం.. మొదలైన ప్రలోభం!

Municipal Election Campaign In Nalgonda District - Sakshi

సాక్షి, నకిరేకల్‌(నల్లగొండ): జిల్లాలో జరగుతున్న నకిరేకల్‌ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగి సింది. దీంతో మైకులు మూగబోయాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్‌కు 72 గంటల ముందే గడువు విధించడంతో రెండు రోజుల ముందే మున్సిపాలి టీ ఎన్నికల అభ్యర్థుల ప్ర చా రం పరిసమాప్తమైంది. ఆ యా పార్టీల అభ్యర్థుల దృష్టాంతా ఓట్ల కొనుగోళ్లపైనే కేంద్రీకృతమైంది. నకిరేకల్‌ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకుగాను 21,382 మంది ఓటర్లు ఉన్నారు. అధికార టీ ఆర్‌ఎస్‌ పార్టీ ఒంటరిగా అన్ని వార్డులకు పోటీ చేస్తోంది. వివిధ పా ర్టీలకు చెందిన 93 మంది పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి 20, కాంగ్రెస్‌ నుంచి 16, బీజేపీ నుంచి 14, సీపీఎం నుంచి ము గ్గురు, టీడీపీ నుంచి ఒకరు, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 14మంది, ఇండిపెండెంట్లు 25మంది మొత్తం 93 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వార్డుల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఆల్‌ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీల మధ్య పోటీ నెలకొంది. కొన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, మరికొన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్, ఫార్వర్డ్‌ బ్లాక్, మరికొన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా రీతిలో కనిపిస్తోంది. వారం రోజుల పాటు జోరుగా ప్రచారం చేయడంతోపాటు, ఇంటింటికీ అభ్యర్థులు, వారి పార్టీల కార్యకర్తలు తిరి గారు. ఒక్కో వా ర్డును కనీసం నాలు గైదు పర్యాయాలు చుట్టి వచ్చారు.

పోలింగ్‌ ఈనెల 30న జరగనుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఆయా వార్డుల్లో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పలు రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు, స్వతంత్ర అభ్యర్థులు సై తం ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తూ ఓట్లు అ భ్యర్థిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి వార్డులో 900 నుంచి 1200 లోపు ఓట్లు కలిగి ఉన్నాయి. ఇందులో క నీసం అరవై శాతం ఓట్లకు డబ్బులు పంచితే చా ల న్న ఆలోచనలో ఆయా పార్టీల అభ్యర్థులు ఉన్నట్లు ప్రచారం. కొన్ని వార్డుల్లో కొంత మంది అభ్యర్థులు ఒక్కో ఓటరుకు రూ.1500 నుంచి రూ.3వేల వరకు పంచుతున్నట్లు సమాచారం. ఇక పోటీ ఎక్కువగా ఉండి తప్పదు అనుకున్న కొన్ని వార్డుల్లో మాత్రం ఓ టుకు రూ.5 వేల చొప్పున పంచే ఆలోచనలో మ రికొందరున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పలు వార్డుల్లో ఇప్పటికే ఓటుకు రూ. 2వేలు పంచినట్లు తెలుస్తోంది. మరొక వార్డులో ఇంటింటికీ కేజీ చికెన్‌ కూడా పంపిణీ చేశారని తెలుస్తోంది. 

ఆఖరి రోజున జోరుగా ప్రచారం..
నకిరేకల్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి మంగళవారం చివరి రోజు కావడతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఫార్వర్డ్‌ బ్లాక్, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ తరపున మంత్రి జగదీశ్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నకిరేకల్, తుంగతుర్తి, కోదాడ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, బొల్లం మల్లయ్య రోడ్డుషో, ప్రచార సభలు నిర్వహించారు. కాంగ్రెస్‌ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, పాల్వాయి రజనీలు ప్రచారంలో పాల్గొన్నారు.

మందు... విందు..
నకిరేకల్‌ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా వార్డుల్లో పురుష ఓటర్లను ఒకే చోటకు చేర్చి సిట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు. మద్యంతో మర్యాదలు చేయాల్సి వస్తోందని.. ఎక్కువ ఖర్చు అవుతోందని కొందరు అభ్యర్థులు వాపోతున్నారు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు తమ వెంట తిరిగే వారికి రోజు కూలి మాట్లాడుకొని తిప్పుకున్నారని, ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.350 వరకు ప్రతిరోజు చెల్లించారని సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top