వినోద రంగంలోకి బొగ్గు గనుల సంస్థ
కూల్చివేసిన ఓల్డ్ అశోక టాకీస్ స్థలంలో నిర్మాణం
కార్యాచరణ రూపొందించిన యాజమాన్యం
గోదావరిఖని: వివిధ వాణిజ్య, వ్యాపార రంగాల్లో రాణిస్తున్న బొగ్గు గనుల సంస్థ.. తాజాగా వినోద రంగంలోనూ ప్రవేశించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మల్టీప్లెక్స్ నిర్మించేందుకు శ్రీకారం చుడుతోంది. భారీ షాపింగ్ మాల్స్‌లోనే మల్టీప్లెక్స్ నిర్మించేందుకు యోచిస్తోంది.
కూల్చివేసిన థియేటర్ స్థానంలో..
గోదావరిఖనిలో ఇటీవల కూల్చివేసిన ఓల్డ్ అశోక థియేటర్ స్థానంలో మల్టీప్లెక్స్ నిర్మించాలని సింగరేణి యాజమాన్యం యోచిస్తోంది. ఇప్పటికే ప్రధాన చౌరస్తాలో షాపింగ్‌కాంప్లెక్స్ పనులు వేగవంతం చేసిన సింగరేణి.. వినోద రంగంలోనూ అడుగిడాలని యత్నిస్తోంది. 4 దశాబ్దాల క్రితం సింగరేణి యాజమాన్యం సినిమా థియేటర్లకు నామమాత్రపు అద్దె ప్రతిపాదికన స్థలాలను లీజుకు ఇచ్చింది. 3 థియేటర్లు సింగరేణి సంస్థ స్థలాల్లో ఉండగా, శిథిలావస్థకు చేరిన ఒక థియేటర్‌ను సింగరేణి స్వా«దీనం చేసుకుంది. ఆ స్థలంలో మల్టీఫ్లెక్స్ నిర్మించాలని సింగరేణీ సీఎండీ బలరాం వెల్లడించారు.
మూడు జిల్లాల ప్రజలకు వినోదం..
మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్ కలిపి నిర్మిస్తే ఈప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని యాజమాన్యం భావిస్తోంది. సింగరేణి విస్తరించి ఉన్న మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు మధ్యలో ఉన్న గోదావరిఖనిలో మల్టీప్లెక్స్ నిర్మించడం ద్వారా.. మూడు జిల్లాల ప్రజలకు వినోదంతో పాటు షాపింగ్ కూడా అనువుగా ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
సొంతంగానా? అద్దె ప్రాతిపదికనా?
సింగరేణి స్థలంలో మల్టీప్లెక్స్ సొంతంగా నిర్మించాలా? లేక స్థలాన్ని లీజుకు ఇచ్చి పీపీఈ పద్ధతిన కొనసాగించాలా? అనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సంస్థ సీఎండీ ఆదివారం గోదావరిఖనికి వచ్చిన సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించడంతో అధికారులు కూడా విశ్లేíÙస్తున్నారు. సీఎండీ మాటల్లో చూస్తే.. సొంతంగానే మల్టీప్లెక్స్ నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే తుదిరూపు
సింగరేణి ఆధ్వర్యంలో మల్టీప్లెక్స్ నిర్మించాలని యోచిస్తున్నాం. వ్యాపార విస్తరణలో భాగంగా మల్టీప్లెక్స్ నిర్మాణంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నాం. గోదావరిఖనిలో మల్టీఫ్లెక్స్ నిర్మిస్తే సింగరేణి కారి్మక కుటుంబాలకు ఎంతో అనువుగా ఉంటుంది. భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఉన్న సింగరేణి కారి్మక కుటుంబాలకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. – ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి


