అత్త సెల్‌ఫోన్‌ అమ్మేసి, ఆపై.. | Mother-in-law Ends Life In Ghatkesar | Sakshi
Sakshi News home page

అత్త సెల్‌ఫోన్‌ అమ్మేసి, ఆపై..

Jun 11 2025 12:16 PM | Updated on Jun 11 2025 12:16 PM

Mother-in-law Ends Life In Ghatkesar

మేడ్చల్−మల్కాజిగిరి జిల్లా: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.  ఘట్కేసర్‌లో బుజ్జి అనే మహిళ నివాసముంటోంది. బుజ్జికి బాబురావు అనే అల్లుడు ఉన్నాడు. ఈ క్రమంలో అత్త వద్ద ఉన్న మొబైల్‌ను బాబు రావు తీసుకున్నాడు. డబ్బుల కోసమో మరే ఇతర కారణమో తెలియదు కానీ అత్త మొబైల్‌ను బాబు రావు అమ్మేశాడు. ఆ తరువాత మొబైల్ ఇవ్వాలని కోరగా.. అమ్మేసినట్లు చెప్పాడు బాబురావు. 

దీంతో మొబైల్ అమ్మడంపై అల్లుడిని నిలదీసింది అత్త బుజ్జి. మొబైల్‌ను అమ్మాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించింది. ఈ విషయంపై అల్లుడు బాబురావు, అత్త బుజ్జి మధ్య గొడవ తలెత్తింది. ఈ విషయాన్ని బాబురావు సీరియస్‌గా తీసుకున్నాడు. మొబైల్ ఫోన్ కోసం అవమానించారంటూ కోపంతో రగిలిపోయాడు.

 క్షణికావేశంలో అత్త బుజ్జి గొంతు నులిమాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన బుజ్జు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బుజ్జి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన ఘట్‌కేసర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొబైల్‌ ఫోన్‌ కోసం అత్తను చంపేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement