జ్వరం వస్తే కూడా రాజకీయం.. వాటికి భయపడితే హైదరాబాద్‌లో ఉండేవాళ్లమా?

Minister Talasani Srinivas Yadav Comments on ED, IT Raids - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తప్పు చేసిన వాళ్లే భయపడతారని చెప్పారు. నవంబర్‌ 27న 15 నియోజకవర్గాల పరిధిలో ప్రజాప్రతినిధుల జనరల్‌ బాడీ సమావేశం తెలంగాణ భవన్‌లో నిర్వహిస్తామన్నారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఈ సమావేశం ఎలా నిర్వహించాలి అనే దానిపై గ్రేటర్ లీడర్లు అందరం చర్చించాం. వ్యవస్థలు వారి చేతుల్లో ఉన్నాయని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.

వ్యవస్థలు ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. తర్వాత మా చేతుల్లోకి రావొచ్చు. టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. ప్రజలు అన్ని చూస్తున్నారు. మేం అన్నింటినీ ఎదుర్కొంటాం. దేశంలో ఏం జరుగుతుందో అన్ని గమనిస్తున్నాం. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులు చేస్తున్నారు. రొటీన్‌గా చేస్తే పట్టించుకోం. కానీ టార్గెట్‌గా నడుస్తోంది. నాకు జ్వరం వస్తే కూడా రాజకీయం చేశారు. ఇవన్నీ భయపడి ఉంటే హైదరాబాద్‌లో ఎలా ఉంటాం' అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

చదవండి: (పదే పదే క్లీన్‌బౌల్డ్‌.. ఇంతకీ కాంగ్రెస్‌ వ్యూహమేంటి?)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top