నాకంటే ముందు రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ సంచలనం | Minister konda surekha key comments in delhi | Sakshi
Sakshi News home page

నాకంటే ముందు రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ సంచలనం

Sep 2 2026 3:24 PM | Updated on Sep 2 2026 3:40 PM

Minister konda surekha key comments in delhi

న‍్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో ఆమె చిట్‌చాట్‌లో పాల్గొన‍్నారు. తాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని తెలిపారు. ఆయనకు తన వివరణ ఇచ్చానని చెప్పారు. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని హెచ్చరించారు. కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ తనకు దొరకలేదని అన్నారు. తన బిడ్డ ఉన్న విషయాలే మాట్లాడారని చెప్పారు. ఉన్నది మాట్లాడితే చర్యలు ఎందుకని ప్రశ్నించారు. 

‘‘భట్టి విక్రమార్క, పొంగుటేలి కమీషన్లపై ఎందుకు చర్యల్లేవు? నాకంటే ముందు రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి. పదేళ్లు తానే సీఎంనని రేవంత్‌ ఎలా అంటారు? నేను లెటర్ల రూపంలో అధిష్ఠానికి చెప్పాల్సింది చెప్పాను. బెంగళూరులో ఖర్గేను కలిసినప్పుడే అన్నీ చెప్పాను. నా కూతురిని రెచ్చగొట్టినందుకే విమర్శించింది. ఎమ్మెల్యే టికెట్‌ ఎవరికి అనేది రేవంత్‌ రెడ్డి ఎలా నిర్ణయిస్తారు? నా కూతురు మాట్లాడినదానికి నాపై చర్యలు తీసుకోవద్దు’’ అని కొండా సురేఖ అన్నారు. 

కాగా, ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానంతో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సమావేశమయ్యారు. కొండా సురేఖ అంశంపై వారు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తమ అభిప్రాయాలు చెప్పినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై కూడా చర్చించినట్లు సమాచారం. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. 

ఇదీ చదవండి: బంగారం ఎందుకు కొనొద్దు? విదేశీ పర్యటనలు ఎందుకు వద్దు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement