ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లో సంస్థాగత వ్యవహారాలపై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీలోని ఇందిరా భవన్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో వారు భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీ సంస్థాగత అంశాలు, కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన తదితర అంశాలపై చర్చించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కూడా అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీకి వచ్చామని, ఆయనను స్మరించుకుంటున్నామని మహేష్ గౌడ్ తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలుస్తున్నట్లు చెప్పారు. అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ చార్జ్‌షీట్


