సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరవ్యాప్తంగా వెలిసిన వ్యంగ్య పోస్టర్లు రాజకీయ కలకలం రేపుతున్నాయి. “1000 DAYS OF CONGRESS GOVERNMENT” పేరుతో ఏర్పాటు చేసిన పోస్టర్లలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో, ఈ పోస్టర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ఈ పోస్టర్‌లలో సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ డబ్బుల మూటలు, పేదల ఆర్తనాదాలు వంటి వ్యంగ్య చిత్రాలను ప్రదర్శించారు. సచివాలయం, గాంధీ భవన్, జూబ్లీహిల్స్‌తో పాటు నగరంలోని పలు ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. బుధవారం ఉదయం నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా పోస్టర్లు కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: సురేఖను తప్పించాల్సిందే!


