సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ అంశంపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ అంశంపై సుదీర్ఘంగా చర్చించామని తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై అధిష్ఠానానికి తగిన సమాచారం ఇచ్చామన్నాము. ఇక ఆ వ్యవహారంలో అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అధిష్ఠానందేనని పీసీసీ చీఫ్ అన్నారు.
కాగా నిన్న తెలంగాణ కాంగ్రెస్‌లో సంస్థాగత వ్యవహారాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి వెళ్లారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీ సంస్థాగత అంశాలు, కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన తదితర అంశాలపై చర్చించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కూడా అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చర్యలు తీసుకోనుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


