
లక్నో: యూపీలోని ప్రయాగరాజ్‌లో ఎంతో వైభవంగా మహా కుంభమేళా జరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డికి అక్కడి పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగుతోంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుంభమేళాకు వెళ్లారు. సోమవారం ఉదయం 5.10 గంటలకు ప్రయాగరాజ్‌లోని సంగం ఘాట్‌లో పవిత్ర స్నానం ఆచరించారు. ఈ సందర్బంగా తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సంగం ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయస్వామికి మంత్రి కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. ఈ క్రమంలో మంత్రికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజారులు.. ఆయనను ఆశీర్వదించారు. ఈ మేరకు తాను కుంభమేళాకు వెళ్లిన దృశ్యాలను మంత్రి కోమటిరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇదిలా ఉండగా.. కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా లక్షలాదిగా పాల్గొంటున్నారు. మహా కుంభమేళాలో ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి సందర్భంగా ‘అమృత స్నానాలు’ ముగిసినప్పటికీ భక్తులు ఇప్పటికీ మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు.
ఈరోజు ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పాల్గొని బ్రహ్మ ముహూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించడం జరిగింది..
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం… pic.twitter.com/sZSvsV4tCd— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) February 10, 2025