బండిసంజయ్‌ వ్యాఖ్యలకు హరీశ్‌రావు గట్టి కౌంటర్‌

Minister Harish Rao Slams Bandi Sanjay Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫసల్‌ బీమా యోజన అమలు చేయాలంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి హారీశ్‌ రావు.. అసలు ముందు ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలవా? అంటూ ట్విట్టర్‌ వేదికగా గట్టి కౌంటరిచ్చారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..వాస్తవానికి దేశంలోని 10 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని, పార్లమెంట్ సాక్షిగా స్వయంగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమరే చెప్పారు. దీనిని బట్టే అర్థం కావాలి అసలు ఆ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదని.అయినా పంట నష్టపోయిన రైతులకు అండగా ఉండేందుకు సుమారు రూ. 10 వేలు చొప్పున నష్టపరిహారం ప్రకటించి  సీఎం కేసీఆర్‌ మరోసారి రైతు బిడ్డనని నిరూపించుకున్నారు.

కానీ బీజేపీ నేతలకు ఇది చాలా చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరం. అయినా దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్న ఎక్కువ సాయం చేసినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత మాది. సాగు రైతు సంక్షేమం గురించి బీజేపీ నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ  మండిపడ్డారు. అయినా బీజేపీ నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, అదాని ఆదాయాన్ని డబుల్‌ చేశారంటూ విరుచుకుపడ్డారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ..నల్ల చట్టాలను తెచ్చి రైతులను బలి చేసిన చరిత్రే మీది అని విమర్శల గుప్పించారు. 

(చదవండి: రాహుల్‌పై అనర్హత వేటు: కాంగ్రెస్‌ శ్రేణుల స్పందన.. నియంతృత్వ చర్యన్న ఖర్గే)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top