క్రికెట్‌ మ్యాచ్‌: అలరించిన హరీశ్‌ | Minister Harish Rao Bowling In Cricket Tournament At Siddipet | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ మ్యాచ్‌: అలరించిన హరీశ్‌

Dec 13 2020 1:00 PM | Updated on Dec 13 2020 1:19 PM

Minister Harish Rao Bowling In Cricket Tournament At Siddipet - Sakshi

బౌలింగ్‌ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు  

సాక్షి, సిద్దిపేట‌: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సారథ్యంలో జిల్లా క్రికెట్‌ జట్టు మరోసారి స్థానిక మినీ స్టేడియంలో క్రికెట్‌ క్రీడాభిమానులను అలరిస్తుంది. ఇటీవల హైదరాబాద్‌  మెడికవర్‌ డాక్టర్స్‌ జట్టుతో తలపడి విజయం సాధించిన సిద్దిపేట జట్టు శనివారం రాత్రి హైదరాబాద్‌ యశోదా హాస్పటల్‌ జట్టుతో పోటీ పడింది. టాస్‌ గెలిచిన  యశోదా హాస్పటల్‌ జట్టు కెప్టెన్‌ కార్తీక్‌ బ్యాటింగ్‌ను ఎంచుకోగా సిద్దిపేట బౌలింగ్‌ చేసింది.

ఈ పోటీలో సిద్దిపేట జట్టు తరఫున ఎన్‌ఐఎస్‌ఏ డైరెక్టర్‌ సీవీ ఆనంద్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, సిద్దిపేట సీపీ జోయల్‌ డేవివీస్‌ తదితర ప్రముఖులు క్రీడలో పాల్గొనడంతో క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో ఆటను వీక్షించారు. మొదటి ఓవర్‌ను సీవీ ఆనంద్‌ వేసి కెప్టెన్‌ కార్తీక్‌ వికెట్‌ సాధించడంతో జిల్లా జట్టులో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 12 ఓవర్లు పూర్తయ్యే సరికి యశోదా హాస్పటల్‌ జట్టు 58 పరుగులు సాధించి 4 వికెట్లను కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement