‘రాష్ట్రంలోనే మేడ్చల్ అగ్ర పథంలో కొనసాగుతుంది’

Medical District Is 1st Place In Telangana Says Minister Niranjan reddy - Sakshi

సాక్షి, మేడ్చల్‌ : రైతులు అన్నివిధాలుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలనే లక్ష్యంతో అన్నదాతల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట్‌ మండల కేంద్రంలో వ్యవసాయదారుల సేవ సహకార సంఘం నిర్మించిన భవనాన్ని భవనాన్ని మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వెయి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గిడ్డంగులను రెండు కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నారు. దీంతోపాటు మూడుచింతలపల్లి మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ మాట్లాడుతూ.. శామీర్‌పేట్‌ వ్యవసాయదారుల సేవ సహకార సంఘం ఇతర సహకార సంఘాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

రైతులకు  అవసరమైన గిడ్డంగులను నాబార్డు నుంచి రుణం పొంది తమ సహకార సంఘం అద్వర్యంలోనే రెండు గిడంగులు నిర్మించుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. శామీర్‌పేట్ వ్యవసాయదారుల సేవ సహకార సంఘం అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న చైర్మన్ ముధాకర్ రెడ్డిని మంత్రి ప్రశంసించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించటంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రాష్ట్రంలోనే అగ్ర పథంలో కొనసాగుతుందని మంత్రి అన్నారు. ముడుచింతలపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణానికి సహాయం చేసిన ముగ్గురు దాతలను మంత్రి అభినందించారు.
చదవండి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం!
అందుకే ఖమ్మం వచ్చా: యాంకర్‌ ప్రదీప్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top