
సాక్షి, మేడ్చల్: తెలంగాణలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
విద్యార్థుల నుంచి వచ్చిన డబ్బుల విషయంలో ఆదాయ పన్నులో హెచ్చు తగ్గులను గుర్తించడంతో ఐటీ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ప్రీతి రెడ్డి, భద్ర రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారుల తనిఖీలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.