13 రోజులు.. 5 లక్షల మంది సందర్శకులు | Massive Rush Seen at Nampally Numaish | Sakshi
Sakshi News home page

13 రోజులు.. 5 లక్షల మంది సందర్శకులు

Jan 16 2025 8:02 AM | Updated on Jan 16 2025 11:41 AM

Massive Rush Seen at Nampally Numaish

అబిడ్స్‌: ఎగ్జిబిషన్‌కు సందర్శకులు పోటెత్తారు. బుధవారం  నుమాయిష్ కు దాదాపు 65 వేల మంది  వచ్చినట్లు  ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 3 నుంచి బుధవారం వరకు సుమారు 5 లక్షల మంది సందర్శించినట్లు వివరించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్శకులందరినీ మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ముమ్మరం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement